Delhi CM: సీఎంవో కార్యాలయానికి సీలు.. ఇంటి సోఫా కూర్చోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ సీఎం అతిషీ

|

Oct 10, 2024 | 2:25 PM

ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదిరింది.

Delhi CM: సీఎంవో కార్యాలయానికి సీలు.. ఇంటి సోఫా కూర్చోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ సీఎం అతిషీ
Delhi Cm Atishi
Follow us on

ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదిరింది. ముఖ్యమంత్రి అతిషి సీఎం నివాసాన్ని ఖాళీ చేయడంపై బీజేపీ లక్ష్యంగా ఆప్ నేతలు ఫైర్ అవుతున్నారు. నవరాత్రుల సమయంలో ఇంటి నుండి బయటకు విసిరిన మహిళా ముఖ్యమంత్రి వస్తువులను చూడండి.. ఢిల్లీ ప్రజల కోసం ఆమె అంకితభావం కూడా చూడాలంటూ సీఎం ఫోటోలను షేర్ చేస్తూ కేంద్రంపై ఫైర్ అవుతున్నారు అప్ నేతలు. బీజేపీ ఆదేశానుసారం ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని సీఎంఓ కార్యాలయానికి తాళం వేశారని ఆరోపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో CM అతిషికి సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేశారు. సీఎం నుంచి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ఇంటిని లాక్కున్నారు. కానీ, ఢిల్లీ ప్రజల కోసం పని చేయాలనే ఆమె అభిరుచిని ఎలా లాక్కుంటారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

నవరాత్రుల సందర్భంగా ఓ మహిళా ముఖ్యమంత్రి ఇంటి వస్తువులను ఆమె ఇంటి నుంచి బయటకు తీయడాన్ని మీరు చూస్తున్నారని, ఢిల్లీ ప్రజల కోసం ఆమె చేస్తున్న అంకితభావాన్ని కూడా చూస్తారని ఆయన అన్నారు. దీంతో పాటు మహా అష్టమి శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ సింగ్ పోస్ట్ చేసిన చిత్రాలలో, సీఎం అతిషి సోఫాలో కూర్చుని ఫైల్‌పై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ముందు చాలా అట్ట పెట్టెలు కూడా ఉన్నాయి. అవి ముఖ్యమంత్రికి సంబంధించినవిగా ఆప్ నేతలు చెబుతున్నారు.

అంతకుముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సివిల్ లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు. ఎల్‌జీ వీకే సక్సేనా దానిని బీజేపీ నాయకుడికి కేటాయించాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. CMO చేసిన ఈ ఆరోపణ తర్వాత, AAP ప్రభుత్వం, LG కార్యాలయం మధ్య వివాదం తీవ్రమైంది.

6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని గతంలో ఎల్‌జీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ముఖ్యమంత్రి అతిశికి ఇంకా కేటాయించలేదు. అతిషి తన వస్తువులను కేటాయించకుండా అక్కడే ఉంచారు. తరువాత దానిని స్వయంగా అక్కడ నుండి ఎలా తొలగించారని ఎల్‌జీ కార్యాలయ ప్రతినిధి ప్రశ్నిస్తున్నారు. అసలు కార్యాలయం ఇవ్వకుండానే వస్తువులు ఎలా బయటకు వస్తాయంటున్నారు. ఇదిలావుంటే, ఈ బంగ్లా యాజమాన్యం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) వద్ద ఉంది. ఒకవేళ బంగ్లా ఖాళీగా ఉంటే, వారే దానిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ ఉంచిన వస్తువుల జాబితాను తయారు చేసిన తర్వాతే ఈ బంగ్లా కేటాయింపు జరుగుతుంది. ఆప్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎల్‌జీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జాబితా సిద్ధం చేసిన వెంటనే ఈ బంగ్లాను సీఎం అతిశీకి కేటాయించనున్నారు.

కాగా, దీనికి ముందు, అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ముఖ్యమంత్రి అయిన అతిషి మూడు రోజుల క్రితం సోమవారం తన వస్తువులతో ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న బంగ్లాకు వచ్చారు. ఈ బంగ్లా 9 సంవత్సరాలకు పైగా అరవింద్ కేజ్రీవాల్ వద్ద ఉంది. అతను సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత దానిని ఖాళీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..