ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాకి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. గత వారం రోజులుగా తాను క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. మొదట తనకు నెగెటివ్ అని రిపోర్టు వచ్చిందని, కానీ జ్వరం కొంత పెరగడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా కరోనా పాజిటివ్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ మధ్య నగరంలో కరోనా వైరస్ కేసులు తగ్గినప్పటికీ ఈ వారం రోజుల్లో కేసులు మళ్ళీ పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
पिछले हफ्ते हल्का बुखार होने के बाद मैंने covid टेस्ट कराया था जिसकी रिपोर्ट negative थी, लगातार अस्वस्थ महसूस करने के कारण मैंने फिर से कोरोना का टेस्ट कराया जो positive आया है।
वैसे तो मैं पिछले 1 week से quarantine हूं फिर भी कोई मेरे संपर्क में आया हो तो वह अपनी जांच करा ले।
— Adesh Gupta (@adeshguptabjp) September 16, 2020