Traffic Jam: 2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం చూపిస్తున్న ట్రాఫిక్!

సాధారణంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. తాజాగా బారాపులా ఫేజ్‌-3 ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రారంభించడంతో.. వాహనాలన్నీ అదే కారిడార్‌గుండా వెళ్లడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జస్ట్ 2 కి.మీ ప్రయాణానికి సుమారు అరగంట సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను సమస్యను క్లియర్ చేశారు.

Traffic Jam: 2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం చూపిస్తున్న ట్రాఫిక్!
Massive Traffic Chaos On Delhi's New Barapullah Phase 3 Flyover

Updated on: Oct 06, 2026 | 8:30 AM

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అయితే ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా చేపట్టిన బారాపులా ఫేజ్‌-3 ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే సోమవారం ఒక్కసారిగా ఈ కారిడార్‌పై ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మయూర్‌ విహార్‌ నుంచి ఎయిమ్స్‌ వైపు వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది.

దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ వెంటనే పరిస్థితిని అదుపు చేసే చర్యలు చేపట్టారు. బారాపులా ఫేజ్‌-3 నుంచి వచ్చే వాహనాలను ఎన్‌హెచ్‌-24, డీఎన్‌డీ వైపు మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య కాస్త సద్దుమణిగింది. అలాగే ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్న కారణంగా వాహనదారులు ఈ రూట్‌లో రావద్దని.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

అయితే ట్రాఫిక్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం.. ఇతర ప్రాంతాల నుంచి 8 నుంచి 9 లేన్లలో వచ్చే వాహనాలు అన్ని బాలాపురా ఫ్లోవర్ వద్దకు రాగేనే ఒక్కటిగా మారి.. మూడు లైన్‌లు ఉన్న ఫ్లైఓవర్ పైకి వస్తున్నాయని.. దీని కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. అంతేకాదు.. ఇక్కడ భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడిన విషయం గూగుల్ మ్యాప్‌లో చూపించట్లేదని..దీంతో ప్రయాణికులు కూడా ఈ మార్గంలోనే రావడంతో ట్రాఫిక్ మరింత పెరుగతుందని తెలిపారు.

అయితే తాజాగా ఓపెన్ అయిన బాలాపుర కారిడార్ అందుబాటులోకి వస్తే ఈ రూట్స్‌లో ట్రాఫిక్ చాలా వరకు తగ్గి ఎయిమ్స్‌ వెళ్లడం మరింత సులభతరం అవుతుందని ప్రారంభానికి ముందూ భావించారు అందరూ. కానీ ఇప్పడు అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. వాహనాలన్నీ.. అదే రూట్‌లో రావడంతో ట్రాఫిక్ జామ్ పెరిగి.. కేవలం రెండు కిలో మీటర్లు వెళ్లేందుకు 30 నిమిషాల పట్టిందని ఓ ప్రయాణికులు తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us