Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

|

Jul 17, 2021 | 7:40 PM

Station Master: రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అధికారులు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా.. భారీ విధ్వంసంతో..

Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Trains
Follow us on

Station Master: రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అధికారులు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా.. భారీ విధ్వంసంతో పాటు.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్టేషన్ మాస్టర్లు, ఇతర కీలక అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ నిర్వాకంతో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య కొన్ని గంటలపాటు రైళ్ళు నిలిచిపోయాయి. పై అధికారులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సదరు వ్యక్తి ఎంతకూ స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఆందోళనతో ఉరుకులు పరుగుల మీద వచ్చిన అధికారులు.. అక్కడి పరిస్థితిని చూసి కంగుతిన్నారు. అ‍ప్పటికే ఫూటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు ఆ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన అనిరుద్‌ కుమార్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా విధులకు హజరైన అతను.. డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వచ్చి సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్‌ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి.

ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు అనిరుద్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఆ అధికారి నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. ఫోన్‌ తీయకపోవడంతో ఆందోళనకు గురైన పై అధికారులు అక్కడి వచ్చారు. వచ్చి చూడగా.. అతను ఉన్న స్థితిని గమనించి షాక్‌ అయ్యారు. అనిరుద్‌ కుమార్‌ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసి తుండ్లాలోని మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇతని నిర్లక్ష్యం కారణంగా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని, ఇలాంటి అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం.. కొనసాగుతున్న ఆపరేషన్.. ఆరేళ్ల చిన్నారి మృతి..

Sanchaita: అశోక్ గజపతి రాజుపై మరోసారి విరుచుకుపడిన సంచయిత.. ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్..