Delhi Election Results: ఢిల్లీ దంగల్.. మాజీ సీఎం కేజ్రీవాల్ వెనుకంజ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్‌లో ఆప్‌ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు.  మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అలాగే కాల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతీషీ, జంగపూర్ నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.

Delhi Election Results: ఢిల్లీ దంగల్.. మాజీ సీఎం కేజ్రీవాల్ వెనుకంజ
Delhi Results

Updated on: Feb 08, 2025 | 8:41 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్‌లో ఆప్‌ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు.  మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అలాగే కాల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతీషీ, జంగపూర్ నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు. అటు బురారి, మాలవ్యనగర్‌, దేవ్‌లీ స్థానాల్లో ఆప్‌ ముందంజలో ఉంది. ఇక ఇప్పటిదాకా బీజేపీ 14 స్థానాల్లో, ఆప్ 10 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. మరోవైపు బాదిలి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ ముందంజలో ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత ఒక స్థానంలో కాంగ్రెస్‌కి ఆధిక్యం కనిపించింది. శకూర్‌బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్రజైన్‌ ముందంజలో ఉండగా.. ముస్లిం ప్రాంతాల్లోనూ ఆప్‌ ఆధిక్యం కొనసాగుతోంది.