దేశ రాజధానికి పొంచివున్న మరో ముప్పు..

|

Jun 29, 2020 | 12:34 PM

దేశ రాజధాని ఢిల్లీకి మరో ప్రమాదం పొంచివున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) విడుదల చేసిన నివేదిక ఒకటి నగర వాసులను ఆందోనళకు గురిచేస్తోంది. నగరంలోని దాదాపు 90 శాతం భవనాలు

దేశ రాజధానికి పొంచివున్న మరో ముప్పు..
Follow us on

దేశ రాజధాని ఢిల్లీకి మరో ప్రమాదం పొంచివున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) విడుదల చేసిన నివేదిక ఒకటి నగర వాసులను ఆందోనళకు గురిచేస్తోంది. నగరంలోని దాదాపు 90 శాతం భవనాలు భూకంపాలను తట్టుకోలేవని ఎంసీడీ నివేధికలో తేల్చి చెప్పింది. తరచూ భూకంపాలకు గురయ్యే నగరంలో ఇప్పుడీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఆయా భవన నిర్మాణాల్లో భారీగా లోపాలు ఉన్నాయని, తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడు ఇవి తట్టుకోలేవని నివేదిక పేర్కొంది.

లోపాలను గుర్తించిన దాదాపు 100 భవనాలకు దక్షిణ ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. నెహ్రూ ప్లేస్‌లో ఉన్న 16 అంతస్తుల మోడీ టవర్, 17 అంతస్తుల ప్రగతిదేవి టవర్, 15 అంతస్తుల అన్సల్ టవర్, 17 అంతస్తుల హేమ్‌కుంట్ టవర్‌లను నిర్మాణాత్మక ఆడిట్ కోసం నోటీసులు ఇచ్చింది. నోటీసు అందుకున్న భవనాల యాజమానులు 90 రోజుల్లో నిర్మాణాత్మక ఆడిట్ నిర్వహించాలని కోరింది.