దారుణం.. కల్తీ మద్యం ఘటనలో 61కి పెరిగిన మృతుల సంఖ్య.. వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ..

|

Jun 26, 2024 | 1:48 PM

మరోవైపు ఈ కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు కూడా మరణించడంపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్‌ ఇవాళ బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని

దారుణం.. కల్తీ మద్యం ఘటనలో 61కి పెరిగిన మృతుల సంఖ్య.. వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ..
Kallakurichi Hooch Tragedy
Follow us on

తమిళనాడులోని కళ్లకురిచ్చి ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. జూన్ 18న కరుణాపురం గ్రామంలో కల్తీ మద్యం తాగిన వారిలో 118 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా, ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్పందించింది. తమిళనాడు చీఫ్‌ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక కోరింది.

మరోవైపు ఈ కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు కూడా మరణించడంపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్‌ ఇవాళ బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు.

ఇదిలా ఉంటే, కల్తీ మందు విషాదంపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ ఘటనపై డీఎంకే సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కళ్లకురిచి ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్‌ రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే నిరసనలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..