Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఇంకా గుర్తించని 101 మృతదేహాలు ..

ఒడిశాలోని బాలాసోర్‌ లో ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. గత శుక్రవారం మూడు రైళ్లు ప్రమాదానికి గురవ్వడంతో ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందారు. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన జరిగి మూడు రోజులు గడిచిపోయింది.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఇంకా గుర్తించని 101 మృతదేహాలు ..
Odisha Train Accident

Updated on: Jun 06, 2023 | 1:58 PM

ఒడిశాలోని బాలాసోర్‌ లో ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. గత శుక్రవారం మూడు రైళ్లు ప్రమాదానికి గురవ్వడంతో ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందారు. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన జరిగి మూడు రోజులు గడిచిపోయింది. కానీ ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పలు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 200 మందికిపైగా చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ ప్రమాదంలో 1100 మంది గాయపడగా ఇప్పటివరకు 900 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ ప్రారంభించింది. ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి