Genజీర్ పాలిటిక్స్.. అంతా సోషల్ మీడియానే.. సక్సెస్‌ మంత్రమా? ముంచే మాయాజాలమా?

రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం.. ఇది ఒకప్పటి సబ్జెక్ట్. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రతాపం.. ఇది ఇప్పుడు ట్రెండీ టాపిక్. ఔను, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ నుంచి అమెరికా అధ్యక్షుడి దాకా సోషల్ మీడియానే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారిపోయింది. వేయిపడగలతో ఊడలుదిగిన సోషల్ మీడియా.. రాజకీయాల్లో విచ్చలవిడిగా వినియోగమౌతున్న సోషల్ మీడియా, ప్రభుత్వాలనైనా మార్చేంత శక్తిమంతంగా కనిపిస్తున్న సోషల్ మీడియా.. రేపటిరోజున ఇంకెన్ని వెర్రితలలు వేస్తుంది? జెన్‌జీని వాటేసుకున్న సోషల్ మీడియా రేపటిరోజున కాటెయ్యదన్న గ్యారంటీ ఏముంది? ఈ విశృంఖలత్వం ఏ వైపరీత్యానికి సంకేతం? ఇప్పుడు ముదిరిపోతున్న జెన్‌జీ పాలిటిక్స్... ముంచడానికా లేక తేల్చడానికా? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Genజీర్ పాలిటిక్స్.. అంతా సోషల్ మీడియానే.. సక్సెస్‌ మంత్రమా? ముంచే మాయాజాలమా?
Is Social Media Controlling Indian Politics

Updated on: Jul 31, 2026 | 9:54 PM

సైబర్ థ్రెట్ టు డెమొక్రసీ.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న డిజిటల్ ప్రపంచం. వరల్డ్ వైడ్ వెబ్ మీద, పెచ్చుమీరుతున్న సోషల్ మీడియా మీద అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్ద హెచ్చరికే చేశారు. రష్యా, చైనా, ఇరాన్, నార్త్‌కొరియా దేశాలన్నీ కలిసి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్ని మానిప్యులేట్ చేశారని, వ్యతిరేక ప్రచారంతో తన ఓటమికి కారణమయ్యారనేది ఆయన మోపిన అభియోగం. ఇందులో నిజమెంతో తెలీదు గానీ, ఒక అగ్రరాజ్యపు ఎలక్షన్ సిస్టమ్‌నే ఛాలెంజ్ చేసేటంతగా సైబర్ ప్రపంచం ముదిరిపోయిందా అనేదే ఇప్పుడు వరల్డ్ వైడ్ మోతెక్కిపోతున్న డిబేటబుల్ పాయింట్. సోషల్ మీడియాతో రాజకీయాలు ఎంత గట్టిగా పెనవేసుకున్నాయి? నెటిజనం ఎదుట డెమొక్రసీ శీలపరీక్షను ఎదుర్కొంటోందా? ఇండియాలో ఐతే ఇది ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన టైమ్‌లీ సబ్జెక్ట్. ఎందుకంటే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పిడికిట్లోనే నడుస్తున్నాయి, నడవబోతున్నాయి పార్టీలన్నీ. దేశ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పిన ఈ అరుదైన దృశ్యం చూశారా? నీట్‌ రచ్చలనుంచి బ్రేక్‌త్రూ కోసం ఢిల్లీ కన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సిట్టింగేసిన ఆ నలుగురు. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. కేంద్రమంత్రులు, కాకలుతీరిన రాజకీయ యోధులు. అప్పుడే పుట్టిన పసికందు పార్టీ స్పోక్స్ పర్సన్స్ అశుతోష్ రంకా, సౌరవ్ దాస్. ఇద్దరూ పాతికేళ్లకు అటూఇటూ ఉన్న కుర్రకారే....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి