రేపే సుప్రీం మరో కీలక తీర్పు.. ఈసారి తమపై దాఖలైన కేసులోనే ?

|

Nov 12, 2019 | 4:38 PM

తాను పదవీ విరమణ చేసేలోగా చారిత్రాత్మక తీర్పులిచ్చేయాలని సంకల్పించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ బుధవారం మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్దమవుతున్నారు. శనివారం నాడు అయోధ్య వివాదంపై తీర్పునిచ్చి, యావత్ భారతావని ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనున్నారు. నెల రోజులు ఉత్కంఠకు క్రమంగా తెరపడుతోంది. నవంబర్ 17న పదవీ విరమన కానున్న చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ఆలోగానే పలు కీలక కేసులను పరిష్కరించాలని […]

రేపే సుప్రీం మరో కీలక తీర్పు.. ఈసారి తమపై దాఖలైన కేసులోనే ?
Follow us on

తాను పదవీ విరమణ చేసేలోగా చారిత్రాత్మక తీర్పులిచ్చేయాలని సంకల్పించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ బుధవారం మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్దమవుతున్నారు. శనివారం నాడు అయోధ్య వివాదంపై తీర్పునిచ్చి, యావత్ భారతావని ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనున్నారు.

నెల రోజులు ఉత్కంఠకు క్రమంగా తెరపడుతోంది. నవంబర్ 17న పదవీ విరమన కానున్న చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ఆలోగానే పలు కీలక కేసులను పరిష్కరించాలని తలపెట్టారు. అందులో భాగంగా ప్రతీ రోజు విచారణ జరిపి అయోధ్య కేసును ఓ కొలిక్కి తెచ్చారు. అదే క్రమంలో మరిన్ని కీలక తీర్పులు కూడా వెలువరించనున్నట్లు సుప్రీం కోర్టు వర్గాలు చెబుతున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇదివరకే ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూపిటిషన్‌పై కూడా త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్నది.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు మరో కీలక కేసులో తీర్పును వెలువరించబోతున్నారు. ఈ కేసు సాక్షాత్తు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయానికి సంబంధించినదే కావడం విశేషం. సీజేఐ ఆఫీసును ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకురావాలా ? వద్దా ? అనే అంశంపై గొగొయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడు తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో విచారణ గత ఏప్రిల్‌లోనే ముగిసింది. ఆతర్వాత తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. బుధవారం ఈ కేసులో తీర్పును వెలువరించనున్న సమాచారం. ఆ తర్వాత క్రమంగా రాఫెల్ ఆరోపణల కేసు, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లు సహా పలు కీలక కేసుల్లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.