Viral Video: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. లోయలో పడిన ట్రక్‌ను బయటకు లాగి ఔరా! అనిపించారు..

Viral Vedeo: కలిసి కట్టుగా శ్రమిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని నిరూపించారు నాగాలాండ్‌లోని ఓ ప్రాంత ప్రజలు. అందరు కలిసి

Viral Video:  అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. లోయలో పడిన ట్రక్‌ను బయటకు లాగి ఔరా! అనిపించారు..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 11, 2021 | 12:00 PM

Viral Video: కలిసి కట్టుగా శ్రమిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని నిరూపించారు నాగాలాండ్‌లోని ఓ ప్రాంత ప్రజలు. అందరు కలిసి ఐక్యతను ప్రదర్శించి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశారు. ఆధునిక కాలంలో ప్రతి పనికి యంత్రాల మీద ఆధారపడే మనుషులు మొదటిసారిగా యంత్రాలే కాదు తలుచుకుంటే మనుషులు కూడా చేసి చూపిస్తారని నిరూపించారు. ఆపద సమయంలో ఎలా వ్యవహరించాలో చూపించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

లోయలో పడిన ఓ ట్రక్కును ఆ ప్రాంత ప్రజలందరు కలిసి పైకి లాగిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అల్లం లోడుతో వెళుతున్న ఓ భారీ ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న సిబ్బంది స్వల్ప గాయాలతో ప్రాణాల నుంచి బయటపడ్డారు. కానీ ట్రక్ లోయలో ఉండిపోయింది. దానిని పైకి తీసుకురావాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలి దీంతో ట్రక్ సిబ్బందికి ఏం చేయాలో తోచలేదు. అయితే స్థానికంగా ఉండే వారి సాయం కోరారు. దీంతో అక్కడి పురుషులందరు కలిసి దానిని బయటకు తీసుకురావాలనుకున్నారు. అందుకోసం పెద్ద పెద్ద తాడులను కట్టి లోయ నుంచి ట్రక్కును బయటకు లాగుతారు. ఐక్యతతో అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఈ ఘటన ఇప్పడు దేశంలో హాట్ టాఫిక్‌గా మారింది.

లోయ నుంచి లారీని బయటకు లాగుతున్న అద్భుతమైన వీడియో చూడండి:

Leopard: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం.. ఆవు దూడపై దాడి.. భయాందోళనలో ప్రజలు..