Crime news: బెంగళూరు టెకీ చేతి వాటం..133 ల్యాప్‌టాప్‌లు, 19 ఫోన్లు చోరీ! ఖరీదైన గాడ్జెట్స్‌ ఎక్కడున్నా చిటికెలో మాయం

|

Nov 07, 2023 | 7:22 PM

బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి 133 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు, నాలుగు ట్యాబ్‌లను చోరీ చేసిన కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గతంలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతను చోరీ చేసిన ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు టెకీ దొంగతనాలను చేధించిన పోలీసులు..

Crime news: బెంగళూరు టెకీ చేతి వాటం..133 ల్యాప్‌టాప్‌లు, 19 ఫోన్లు చోరీ! ఖరీదైన గాడ్జెట్స్‌ ఎక్కడున్నా చిటికెలో మాయం
Bengaluru Techie Steals Gadgets
Follow us on

బెంగళూరు, నవంబర్‌ 7: సుమారు రూ.5 లక్షల విలువైన 133 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు, 4 ట్యాబ్లెట్ల దొంగిలించిన బెంగళూరు టెకీని స్థానిక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న టెకీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నిందితుడు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి 133 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు, నాలుగు ట్యాబ్‌లను చోరీ చేసిన కేసులో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గతంలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతను చోరీ చేసిన ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు టెకీ దొంగతనాలను చేధించిన పోలీసులు చాకచక్యంగా చేధించినట్లు బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ బి దయానంద వెల్లడించారు.

గతంలో ఓ ఐటీ కంపెనీలో పనిచేసిన ఈ నిందితుడు పలువురు ఉద్యోగులతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం పేయింగ్‌ గెస్ట్‌, బ్యాచిలర్‌ వసతి గృహాలకు తరచూ వెళ్లుండేవాడు. అక్కడ మాటు వేసి ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు మాయం చేసేవాడు. అతడు చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లి మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకునే వాడు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మరో ఇద్దరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ దయానంద తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. సెంట్రల్‌ డివిజన్‌లో 8 కేసులు గుర్తించామన్నారు. మిగతా పోలీస్‌ స్టేషన్‌లలో ఈ తరహా కేసులు ఎక్కడెక్కడ, ఎన్నేసి చొప్పున నమోదయ్యాయో పరిశీలిస్తున్నట్లు దయానంద తెలిపారు. వీరి నేరాల గురించి పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఇతర వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నగరంలోని 11 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి బెట్టింగ్ ఆపరేషన్‌ను ఛేదించినట్లు దయానంద తెలిపారు. ఈ కార్యకలాపాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో ఐటీ ఉద్యోగులు ఖరీదైన గాడ్జెట్‌లను పోగొట్టుకోవడం, ఓ టెక్కీ మూకుమ్మడిగా గాడ్జెట్‌లను దొంగిలించడం.. ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు మరిన్ని బయటపడతాయా లేదా ఇంతటి ఆగుతాయా అనే విషయం వేచి చూడాల్సిందేనని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.