Heart Attack: క్రికెట్‌ మ్యాచ్‌లో అపశృతి.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి!

గత కొన్ని రోజులుగా హార్ట్ అటాక్‌తో వరుస మరణాలు సంభిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో..

Heart Attack: క్రికెట్‌ మ్యాచ్‌లో అపశృతి.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి!
Cricketer dies of heart attack

Updated on: Feb 26, 2023 | 4:52 PM

గత కొన్ని రోజులుగా హార్ట్ అటాక్‌తో వరుస మరణాలు సంభిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సంత్ రాథోడ్ (34) అనే యువకుడు శనివారం (ఫిబ్రవరి 25) గుండెపోటుతో ప్లే గ్రౌండ్‌లోనే అక్కడికక్కడే మృతి చెందాడు. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌జీఎస్‌టీ) విభాగానికి చెందిన సీనియర్ క్లర్క్ అయిన వసంత్ రాథోడ్ జట్టు మ్యాజ్‌ సమయంలో ఫీల్డింగ్‌ చేస్తోంది. బౌలింగ్‌ సమయంలో బాగానే ఉన్నాడు. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు.

తోటి ఆటగాళ్లు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రాథోడ్ అహ్మదాబాద్‌లోని వస్త్రపూర్ నివాసి అయిన రాథోడ్‌ ఎస్‌జీఎస్‌టీ ప్రధాన కార్యాలయంలో యూనిట్ 14లో పనిచేసేవారు. అతనికి భార్య ఉంది. కాగా గుజరాత్‌లో గత 10 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వారం క్రితం రెండు వేర్వేరు సంఘటనలలో 27 ఏళ్ల ప్రశాంత్ భరోలియా, 31 ఏళ్ల జిగ్నేష్ చౌహన్‌ అనే వ్యక్తులు క్రికెట్‌ మైదానంలో గుండెపోటుతో మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.