వలపు చిలిపి మాటలతో గాలం.. దేశ రహస్యాలు శత్రువులపరం..!

పాకిస్తాన్‌కు స్వయంగా భారతీయులే దేశ రహస్యాలను చేరవేయడమా? ఆశ్చర్యమేం లేదు ఇందులో. దశాబ్దాలుగా పాక్‌ ఐఎస్‌ఐ పన్నుతున్న వలే ఇది. మాధురి గుప్తా కథ మరిచిపోయి ఉంటారు చాలామంది. ఒకప్పటి భారతీయ దౌత్యవేత్త. పాకిస్తాన్‌లో పనిచేసిన ఓ అత్యున్నతస్థాయి అధికారిణి. అప్పటికి ఆమె వయసు 50పైనే. తనకంటే 20ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో పరిచయం చాలాదూరం తీసుకెళ్లింది.

వలపు చిలిపి మాటలతో గాలం.. దేశ రహస్యాలు శత్రువులపరం..!
Spy

Updated on: May 20, 2025 | 9:55 PM

సాధారణంగా చూస్తే అది ఓ సెల్ఫీనే..! తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో డీపీగా పెట్టుకుంది జ్యోతి మల్హోత్రా. బట్.. డీకోడ్‌ చేసి చూస్తే అదొక దేశ రహస్యం. ఒక్క సెల్ఫీతో, పర్టిక్యులర్‌గా ఒక డీపీతో పాకిస్తాన్‌కు బోలెడంత ఇన్ఫర్మేషన్‌ పాస్‌ చేసింది. ఇది దేశ భద్రతా అధికారులనే కంగారుపడేలా చేసింది. అసలు.. జ్యోతి మల్హోత్రా చేసిన వీడియోలు, తీసిన విజువల్స్, తీసుకున్న సెల్ఫీలు.. ప్రతి ఒక్కటీ దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేసేలాగే ఉంది. జ్యోతిని అరెస్ట్‌ చేసిన తరువాత గానీ అందులోని సీక్రెట్‌ ఏంటో బయటపడలేదు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐకి కావాల్సింది కోటలు దాటే మాటలు కాదు. పక్కా ఇన్ఫర్మేషన్. అది చిన్నదైనా ఫర్వాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్‌ పోలీసులు అమృత్‌సర్‌లో ఓ పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్ట్‌ చేశారు. చిన్న ఇన్ఫర్మేషన్‌కు ఐదు వేలు, పెద్ద ఇన్ఫర్మేషన్‌కు 10 వేల రూపాయలు ఇస్తుందట. చాలా చీప్‌గా అనిపిస్తోంది కదూ. బట్.. ఇలా వచ్చే సమాచారాన్నంతా ఒక దగ్గర చేర్చి తనకు కావాల్సిన వ్యూహాన్ని రచించుకుంటుంది పాకిస్తాన్. అందులోనూ పర్టిక్యులర్‌గా ప్రదేశాలు కావాలి పాక్‌ ఐఎస్‌ఐకి. భారత్‌లో ఉండే కీలకమైన ప్రదేశాలు, వాటి గురించి సమాచారం కావాలి. అందుకే జ్యోతి మల్హోత్రాను పక్కాగా ఎంచుకుంది. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్‌ వ్లాగర్‌. సరిగ్గా పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ కోరుకునేది కూడా ఇదే. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ట్రాప్‌లో పడిన తరువాత.. శత్రుదేశానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ను...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి