ఆవుపేడ చిప్ తో ‘మొబైల్ రేడియేషన్ కి చెక్’ !

| Edited By: Pardhasaradhi Peri

Oct 13, 2020 | 2:45 PM

ఆవుపేడతో లాభాలెన్నో అంటున్నారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ భాయ్ కథిరియా !ఈ పేడతో తయారు చేసిన ఓ చిప్..మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ ని తగ్గిస్తుందని,

ఆవుపేడ చిప్ తో మొబైల్ రేడియేషన్ కి చెక్ !
Follow us on

ఆవుపేడతో లాభాలెన్నో అంటున్నారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ భాయ్ కథిరియా !ఈ పేడతో తయారు చేసిన ఓ చిప్..మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ ని తగ్గిస్తుందని, పైగా వివిధ రకాల వ్యాధులనుంచి రక్షిస్తుందని ఆయన చెబుతున్నారు. ఆవుపేడతో తయారైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ‘కామధేను దీపావళి అభియాన్’ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. కౌ డంగ్ ప్రతీవారికీ రక్షణ కవచంలా పని చేస్తుందన్నారు. ఇది యాంటీ రేడియేషన్ అని, పైగా శాస్త్రీయంగా నిరూపితమైందని వల్లభ భాయ్ కథిరియా తెలిపారు. రేడియేషన్ ని అదుపు చేయడానికి మొబైల్ ఫోన్లలో ఈ చిప్ ను వాడవచ్ఛు ..గోస్తవ కవచ్ అని దీన్ని వ్యవహరిస్తున్నాం అని ఆయన చెప్పారు. రాజ్ కోట్ లోని శ్రీజీ గోశాల ఈ చిప్ ను ఉత్పత్తి చేస్తోంది. పండుగలు, పబ్బాల సందర్భంలో ఆవుపేడతో తయారు చేసే ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది.