Sputnik V Vaccine :
Sputnik V Vaccine : రష్యాకి చెందిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండో బ్యాచ్ భారతదేశానికి చేరుకుంది. రష్యా నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయింది. దేశంలో ఆమోదించబడిన మూడు వ్యాక్సిన్లలో స్పుత్నిక్ ఒకటి. మరో రెండు టీకాలు భారత్ బయోటెక్, కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందిన కోవిషీల్డ్. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న రష్యా రాయబారి నికోలాయ్ కుడాషెవ్ ట్విట్టర్‌లో రెండో డోస్‌కి సంబంధించి చిత్రాన్ని షేర్ చేశారు. “స్పుత్నిక్ V రెండవ డోస్ ఈ రోజు హైదరాబాద్‌లోఅడుగుపెట్టింది, అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్‌ను అంతం చేసే కార్యక్రమంలో ఇదో ప్రభావవంతమైన మోడల్ అన్నారు. ద్వైపాక్షిక సహకారంలో భాగంగా భారత్‌కి సేవలందించడం మా బాధ్యత” అని తెలిపారు.
ఇండియాలో ల్యాండ్ అయిన తొలి విదేశీ కరోనా విరుగుడు స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్ తొలి డోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు వేయించుకున్నారు. మే 1న తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు వచ్చాయి. రెండో బ్యాచ్ ఇవాళ వచ్చింది. భారత్‌కి మొదటి నుంచి రష్యా మిత్ర దేశంగా ఉంటోంది. ఈ వ్యాక్సిన్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలపడ్డాయి. ప్రపంచంలో ముందుగా తయారైన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. 2020 మధ్య నుంచి రష్యా ఈ వ్యాక్సిన్ వాడుతోంది. ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త వేరియంట్లకు కూడా బాగా పనిచేస్తోందని రష్యా స్పెషలిస్టులు ప్రకటించారు. రష్యా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకి ఏడాదికి 8.5 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇండియాలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జులై నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టనుంది.
Telangana: Second consignment of Sputnik V arrives in Hyderabad pic.twitter.com/eEWWhd85YK
— ANI (@ANI) May 16, 2021