ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.. దేశంలో 91 లక్షల ఆరోగ్య సిబ్బందికి టీకా..!

|

Feb 17, 2021 | 9:57 PM

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు టీకా లబ్ధిదారుల సంఖ్య 91 లక్షలు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.. దేశంలో 91 లక్షల ఆరోగ్య సిబ్బందికి టీకా..!
Follow us on

Covid vaccination in India: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు టీకా లబ్ధిదారుల సంఖ్య 91 లక్షలు దాటింది. బుధవారం నాటికి మొత్తం 91,86,756 మంది కరోనా వ్యాక్సిన్‌ పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు 5.52 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి జరిగింది. ఇటు బ్రిటన్‌‌లో 1.61 కోట్ల డోసుల టీకాలను అందించారు. తర్వాతి స్థానంలో భారత్‌ 90.6 లక్షల డోసులతో మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అమెరికా, బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమై 60 రోజులు దాటగా, భారత్‌ కేవలం 31 రోజుల్లోనే 90 లక్షల డోసుల మార్క్‌ను దాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి నుంచి మొదలు కానున్న 50 ఏండ్లకు పైబడిన ప్రజలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రైవేట్‌ రంగ సంస్థలు పాల్గొనడంపై యోచిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు, ఇప్పటి వరకు 65,21,785 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా టీకా లబ్ధి పొందారని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి తెలిపారు. వీరిలో 68.5 శాతం అనగా 61,79,669 మంది తొలి డోసు తీసుకోగా, 42.4 శాతం అనగా 3,42,116 మంది రెండో డోసు టీకా వేయించుకున్నారని చెప్పారు. బుధవారం 26,64,972 మంది ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు.

Read Also… Bull punished young men Viral Video :కాపాడిన కుర్రాళ్లుపై తిరగబడ్డ ఎద్దు ..! వైరల్ అవుతున్న వీడియో