Lockdown: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలు..

|

Feb 21, 2021 | 4:06 PM

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతుండడంతో పరిస్థితులు మెరుగవుతున్నాయని సంతోషిస్తోన్న సమయంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడం...

Lockdown: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలు..
Follow us on

Covid Cases Increasing In India: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోందని అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతుండడంతో పరిస్థితులు మెరుగవుతున్నాయని సంతోషిస్తోన్న సమయంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి కరోనా తన పంజాను విసురుతోంది. మహారాష్ట్ర, కేరళలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. వీటితో పాటు పంజాబ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే కేసులు సంఖ్య భారీగా పెరుగుతుండడంతో పుణె అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రేపటి నుంచి (సోమవారం) పుణెలో రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. అంతేకాకుండా ఈనెలాఖరు వరకు పుణెలోని అన్ని విద్యా సంస్థలను మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Corona: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తీవ్రత తెలుసుకోవచ్చు.. సరికొత్త పరికరం రూపకల్పన..