Corona Virus: మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్

| Edited By: Phani CH

Jul 14, 2021 | 3:22 PM

కేరళలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నెల 17,18 తేదీల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. గత జూన్ 12, 13 తేదీల్లో ఏ గైడ్ లైన్స్ ని జారీ చేశామో..

Corona Virus: మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్
Covid Cases In Kerala
Follow us on

కేరళలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నెల 17,18 తేదీల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. గత జూన్ 12, 13 తేదీల్లో ఏ గైడ్ లైన్స్ ని జారీ చేశామో..వాటినే ఇప్పుడు కూడా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. ఏడు రోజుల సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఆధారంగా స్వయం పాలిత ప్రభుత్వ రంగ సంస్థల కేటగిరైజేషన్ పద్దతి కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఏ కేటగిరీలో 165 లోకల్ బాడీలు, బీ కేటగిరీలో 473, సీ లో 316, డీ లో 80 లోకల్ బాడీలు ఉన్నాయి. ఈ ఉత్తర్వుల మేరకు బ్యాంకులు అన్ని 5 రోజులూ పని చేయాల్సి ఉంటుంది. కోవిడ్ నివారణకు కలెక్టర్లు మైక్రో కంటెంయిన్మెంట్ జోన్లను ప్రకటించితగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

తాజా గైడ్ లైన్స్ జులై 15 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులతో కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనకరంగా పరిణమించాయని చెన్నైలోని నిపుణులు అంటున్నారు. కేరళ సహా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు కూడా వీటితో సతమతమవుతున్నాయని వారు తెలిపారు. కేరళలో నిన్న 14,539 కేసులు నమోదు కాగా-124 మంది రోగులు మరణించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు 10.46 శాతం ఉంది. గత 24 గంటల్లో లక్షా 39 వేలకు పైగా శాంపిల్స్ సేకరించారు. ఏమైనా.. కోవిడ్ అదుపునకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ప్రజలు కోవిడ్ ప్రొటొకాల్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కేసులు పెరుగుతున్నాయనని మంత్రి అభిప్రాయపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పెంపుడు పిల్లి మిస్సింగ్..!! పిల్లి ఆచూకీ చెబితే 30 వేల రివార్డు మీ సొంతం..!! ( వీడియో )

Nikhil Siddharth: పెట్రోల్ ధరల పై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!! ఏమన్నాడంటే..?? ( వీడియో )