Covid-19 Vaccine Certificate: కోవిడ్ -19 వ్యాక్సీన్ తీసుకున్నారా? మీ సర్టిఫికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

| Edited By: Team Veegam

May 12, 2021 | 11:19 PM

Covid-19 Vaccine Certificate: కరోనా వైరస్‌ని నిలువరించేందుకు దేశంలో టీకా డ్రైవ్ చేపట్టి నేటికి 116 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు..

Covid-19 Vaccine Certificate: కోవిడ్ -19 వ్యాక్సీన్ తీసుకున్నారా? మీ సర్టిఫికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Covid Vaccine
Follow us on

Covid-19 Vaccine Certificate: కరోనా వైరస్‌ని నిలువరించేందుకు దేశంలో టీకా డ్రైవ్ చేపట్టి నేటికి 116 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు 17.52 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సీన్ తీసుకున్నారు. టీకా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకుంటున్నారు. కరోనాను జయించేందుకు టీకా తీసుకునేందుకు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సీన్ డోస్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కో-విన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో వ్యాక్సీన్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాంతం ఇలా అన్ని వివరాలు ఉంటాయి. వ్యాక్సీన్ వేయించుకోవాలనుకునే వారు వయస్సు ప్రకారం స్లాట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే.. ఒక వ్యక్తి వ్యాక్సీన్ డోస్ తీసుకున్న తరువాత ప్రభుత్వం వారికి టీకా తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఈ సర్టిఫికెట్‌లో లబ్ధిదారుని సంబంధించిన ప్రాథమిక వివరాలు అన్నీ ఉంటాయి. అలాగే లబ్ధిదారుడు పొందిన టీకా, వ్యాక్సీన్ వేయించుకున్న తేదీ, తదితర వివరాలు కూడా ఆ సర్టిఫికెట్‌లో ఉంటాయి. అయితే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల వ్యక్తులు తమ ప్రాంతం, రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్, కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉండాలని నిబంధనలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న లబ్ధిదారులు వ్యాక్సీన్ సర్టిఫికెట్‌ను కోవిన్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా పొందవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న సర్టిఫికెట్ ఈ పోర్టల్‌లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.

కోవిన్ నుండి కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
లబ్ధిదారులు ముందుగా కోవిన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ https://www.cowin.gov.in/home సందర్శించాలి.
ఆ తరువాత సైన్ ఇన్ / రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయండి.
మీ నమోదిత మొబైల్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి. ఆ తరువాత మీ మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాని ద్వారా సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత, మీ పేరుతో సర్టిఫికెట్ ట్యాబ్ ఉంటుంది.
మీ టీకా సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీని పొందడానికి డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.

ఆరోగ్య సేతు నుండి కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మీ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను ఓపెన్ చేయండి.
మీ మొబైల్ నంబర్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
పైన ఉన్న కోవిన్ టాబ్‌పై క్లిక్ చేయండి.
టీకా సర్టిఫికేట్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసిన తర్వాత మీ 13-అంకెల లబ్ధిదారుల రిఫరెన్స్ ఐడిని నమోదు చేయండి.
మీ టీకా సర్టిఫికేట్ పొందడానికి డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి

కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలుత వైద్య ఆరోగ్యశాఖ కార్మికులకు టీకాలు వేయగా.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి టీకాలు వేయడం ప్రారంభించారు. కోవిడ్ -19 టీకా డ్రైవ్ మూడోదశ మార్చి 1వ తేదీ ప్రారంభించగా.. ఈ దశలో 60 ఏళ్లు పైబడిన వారికి టీకాలే వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేశారు.

Also read:

Imrankhan Statement: సొంతింట్లో దిక్కు లేదు కానీ కశ్మీర్‌ కావాలట.. ఆర్టికల్ 370ని రీవోక్ చేస్తేనే భారత్ చర్చలన్న ఇమ్రాన్

krithi shetty : వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఉప్పెన బ్యూటీ.. ఆ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందట..