PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..

|

Jan 30, 2022 | 3:14 PM

PM Modi-Corona Vaccine: భారత దేశం(India)లో కరోనా వైరస్ (Corona Virus)నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccine Drive) జనవరి 16 వ తేదీ 2021న ప్రారంభ‌మై సక్సెస్ ఫుల్ అయింది.

PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..
Pm Modi
Follow us on

PM Modi-Corona Vaccine: భారత దేశం(India)లో కరోనా వైరస్ (Corona Virus)నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccine Drive) జనవరి 16 వ తేదీ 2021న ప్రారంభ‌మై సక్సెస్ ఫుల్ అయింది. మొదట వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో మొదలు పెట్టిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అంచెలంచెలుగా దేశ ప్రజలందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే బూస్టర్ డోసు తో పాటు.. యువత కూడా టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే దేశంలో వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు తెలిపినపూర్తయిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీకా తీసుకున్న ప్రతి ఒక్క పౌరుల‌కు అభినంద‌న‌లు చెప్పారు

దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన ప్రతి ఒక్క భారతీయులకు అభినందనలు.. వ్యాక్సిన్ డ్రైవ్‌ను విజయవంతం చేశారు. అంతేకాదు.. ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణం అంటూ ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ.. దేశంలో 75 శాతం మంది పెద్దవారు వ్యాక్సిన్ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.. కరోనాపై పోరాటంలో మనం మరింత బలపడుతున్నాం.. అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను కోరుతూ.. కేంద్ర‌మంత్రి మాండవ్య ట్వీట్‌ చేశారు.

 

Also Read:  రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..