Covid 4th Wave: భారత్‌లో కరోనా విలయం.. మళ్లీ 20 వేల మార్క్‌ దాటిన కరోనా కేసులు.. మరణాలు..

థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

Covid 4th Wave: భారత్‌లో కరోనా విలయం.. మళ్లీ 20 వేల మార్క్‌ దాటిన కరోనా కేసులు.. మరణాలు..
Coronavirus

Updated on: Jul 14, 2022 | 9:46 AM

India Covid-19 Updates: భారత్‌లో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేసుల సంఖ్య ఒక్కసారిగా 20 వేల మార్క్‌ దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 20,139 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 3,233 కేసులు పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 38 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,36,076 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.10 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.49 శాతం ఉంది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,36,89,989 కి పెరిగింది.
కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,557 కి చేరింది.
నిన్న కరోనా నుంచి 16,482 మంది కోలుకున్నారు.
వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,30,28,356 కి చేరింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.27 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
నిన్న 13,44,714 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

బుధవారం అత్యధికంగా కేరళలో 3,545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు పశ్చిమ బెంగాల్ లో 2,979, మహారాష్ట్రలో 2,575, తమిళనాడులో 2,269, కర్ణాటకలో 1,231 కేసులు నమోదయ్యాయి.

జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us