Covid-19 Caller Tune: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే మూగబోనున్న కరోనా కాలర్ ట్యూన్‌..!

Corona Caller Tune: దేశంలో కరోనావైరస్ మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

Covid-19 Caller Tune: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే మూగబోనున్న కరోనా కాలర్ ట్యూన్‌..!
Covid 19 Caller Tune

Edited By: Ravi Kiran

Updated on: Mar 28, 2022 | 7:03 AM

Corona Caller Tune: దేశంలో కరోనావైరస్ మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి మార్గదర్శకాలు కొనసాగతాయని వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్‌- ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్ల (Covid-19 Caller Tune) ను నిలిపివేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కరోనా ప్రీకాల్‌ సందేశాలను నిలిపి వేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ ప్రీకాల్‌-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందంటూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ సర్వీసును నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి.

అయితే.. కోవిడ్-19 కాలర్ ట్యూన్ ఎప్పుడు ఆగిపోతుందోనన్న విషయంపై ప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రకటన రావాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లు లేఖలో పేర్కొంది. దీంతో కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్త సంస్థ పీటీఐ ట్విట్ చేసి వెల్లడించింది.

కాగా.. కోవిడ్-19 కాలర్ ట్యూన్‌ను రెండేళ్ల క్రితం మహమ్మారి ప్రారంభ దశలో ప్రవేశపెట్టారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన అనంతరం మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో కాలర్ ట్యూన్‌ను ప్రవేశపెట్టారు. వ్యాక్సినేషన్​ సహా.. వైరస్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా కేంద్రం ఈ కాలర్​ట్యూన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Also Read:

Whiskey Brands: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 25 విస్కీ బ్రాండ్‌లు.. అందులో 13 భారతీయు బ్రాండ్లే..!

PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..