Corona Virus: ఉత్తరాదిలో కరోనా బారిన పడుతున్న చిన్నారులు.. తేలిగ్గా తీసుకోవద్దు అంటున్న చిల్డ్రన్ స్పెషలిస్టులు

|

Apr 16, 2022 | 7:17 PM

Corona Virus: దేశంలో ..  ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో(North India) కరోనా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అధికంగా పిల్లలే ఉన్నట్లు పలు నివేదికలు..

Corona Virus: ఉత్తరాదిలో కరోనా బారిన పడుతున్న చిన్నారులు.. తేలిగ్గా తీసుకోవద్దు అంటున్న చిల్డ్రన్ స్పెషలిస్టులు
Delhi Corona
Follow us on

Corona Virus: దేశంలో ..  ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో(North India) కరోనా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అధికంగా పిల్లలే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.  ఢిల్లీ (Delhi) కరోనా యాప్ ప్రకారం… కరోనా బారిన పడిన బాధితులు 51మందిలో 14 మంది పిల్లలున్నారని తెలుస్తోంది. వీరిలో కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 12 మంది, ఇంద్రప్రస్థ అపోలో, మధుకర్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఒక్కొక్కరు చికిత్స తీసుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌లో 16 మంది పిల్లలతో సహా నలభై ముగ్గురు వ్యక్తులు కూడా COVID-19 కు పాజిటివ్ పరీక్షించినట్లు జిల్లా ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. గత వారంలో 25 శాతానికి పైగా కొత్త కేసులు పిల్లల్లో నమోదయ్యాయని పేర్కొంది. “కొత్త కేసులలో, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 16 మంది పిల్లలు పాజిటివ్‌ కేసులని తెలిపింది. గత వారంలో 167 కొత్త కేసులు నమోదయ్యాయి..  వాటిలో 44  మంది పిల్లలు అంటే 26.3 శాతం పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ శర్మ అన్నారు.

అయితే ఇలా అధికంగా పిల్లలు కరోనా బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం.. Omicron వేరియంట్ కేసులు మన దేశంలో అత్యధికంగా నమోదైన సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు కోవిడ్ సోకిన పిల్లలు కూడా చికిత్స నిమిత్తం ICUలలో చేరారు.

అయితే మన దేశంలోని ఉన్న భారీ జనాభాతో పోలిస్తే.. ICU లో చేరిన పిల్లల సంఖ్య చిన్నదిగా కనిపించినప్పటికీ.. తమను చాలా ఆందోళనకు గురి చేసిందని న్యూస్9 కి పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ దీపా పాసి చెప్పారు.  అంతేకాదు ప్రస్తుతం పిల్లలలో కోవిడ్‌ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది” అని  అన్నారు. మునుపటి అధ్యయనాలు పిల్లల్లో SARS CoV-2 వైరస్‌ సోకే అవకాశాలు తక్కువ అని చెప్పాయి. అయినప్పటికీ ఇతర వ్యాధులున్న పిల్లలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారని చెప్పారు.

పిల్లలు కరోనా బారిన పడడం విషయంపై అపోలో హాస్పిటల్స్‌లోని శిశువైద్యురాలు డాక్టర్ దీపా భట్నాగర్ స్పందిస్తూ.. దీని సాధారణ విషయంగా తీసుకోలేమని అన్నారు.  “SARS CoV 2  వైరస్ గురించి ఇదే అంటూ నిర్ధారించి ఏమీ చెప్పలేం..   డెల్టా సమయంలో,  ఓమిక్రాన్ లో కేసులు నమోదయ్యాయని అన్నారు. భారతదేశంలో పిల్లలకు కరోనా విషయాన్నీ  తేలికగా తీసుకోలేము” అని డాక్టర్ భట్నాగర్ అన్నారు.

Also Read: Rare Cancer: ఆ స్కూల్ 100 మంది ఓల్డ్ స్టూడెంట్స్, సిబ్బందికి అరుదైన క్యాన్సర్.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి అధికారులు