ప్రపంచం సాంకేతికతను అందుకని ముందుకు దూసుకుపోతున్నా.. మారుమూల పల్లెల్లో ఇంకా మూఢ నమ్మకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసాలతో దాడులకు తెగబడుతున్నారు. చేతబడి చేస్తున్నారని అనుమానం పెంచుకుని హత్యలకూ వెనుకాడటం లేదు. ఝార్ఖండ్(Jharkhand) గుమ్లా జిల్లాలోని భగత్ బకుమా గ్రామానికి చెందిన సుమిత్రా దేవీ కుమార్తెకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. అదే గ్రామంలో నివాసముండే లుంద్రా చిక్ బరాయిక్, ఆయన భార్య పుల్వామా దేవి దంపతులు చేతబడి చేయడంతోనే తన కుమార్తె ఆరోగ్యం క్షీణించినట్లు సుమిత్రా దేవి భావించింది. లుంద్రా దంపతులపై కక్ష పెంచుకుంది. వారితో తగాదాకు దిగింది. దీంతో సుమిత్రా దేవి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని లుంద్రా దంపతులు ఇటీవలే గ్రామ పెద్దలను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న సుమిత్రాదేవి, ఆమె కుమారుడు రవీంద్ర కోపంతో రగిలిపోయారు. లుంద్రా ఇంట్లోకి చొరబడి ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి తీవ్రంగా దాడి చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో లుంద్రా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి, తమదైన శైలిలో విచారణ చేపట్టగా సుమిత్రా దేవీ, ఆమె కుమారుడు రవీంద్ర లు నిందితులని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవీచదవండి.
Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..