
ఈ ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సర్వం సిద్దం చేసుకుంది. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అనేకం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో తాజాగా జరుగుతున్న పీఎస్ఎల్వి సి.62 ప్రయోగం ద్వారా మరో ఉపగ్రహాన్ని పంపనుంది. శత్రుదేశాల కదలికలను గుర్తించేందుకు ఇస్రో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల పరంపరలో ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషణ అనే నామకరణం చేశారు. ఇక నుంచి భూ పరిశీలన అలాగే సరిహద్దులో దేశ భద్రత కోసం రక్షణ కవచనంలో పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేష సీరిస్ లో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇది వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవించే సమయంలో ముందస్తు సమాచారం కూడా ఇస్తుంది.
ఈనెల 12 న సోమవారం శ్రీహరికోటలోని షార్ నుండి PSLV C62 రాకెట్ ప్రయోగం ద్వారా ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు నింగిలోకి పంపుతున్న ఈ Eos N1 ( అన్వేష) శాటిలైట్ సుమారు 1,485 కేజీలు బరువు కలిగి ఉంది. దీనిని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింక్రనైజ్ ఆర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఇదొక్కటే కాదు దీనితో పాటు 200 కేజీల బరువుతో కూడిన మరో 15 ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు
సింగపూర్, లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, యూఏయి దేశాలుకు చెందిన చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. స్వదేశీ అవసరం కోసం మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడంతో పాటు కమర్షియల్‌గా కూడా ఇతర దేశాలకు చెందిన 15 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఆదాయం మార్గంగా కూడా ఈ ప్రయోగం ఇస్రోకి దోహదపడుతోంది. రేపటి నుంచి అంతరిక్షంలో పొరుగు దేశాల కదలికలను గమనించే అన్వేషణ మొదలవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.