కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ ‘కోయంబేడు మార్కెట్’.. క్వారంటైన్ కి 459 మంది తరలింపు

| Edited By: Anil kumar poka

May 05, 2020 | 12:42 PM

తమిళనాడు లోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ గా మారింది. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ కి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వ్యాపారులు వస్తుంటారు...

కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ కోయంబేడు మార్కెట్.. క్వారంటైన్ కి 459 మంది తరలింపు
Follow us on

తమిళనాడు లోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్ గా మారింది. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ కి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వ్యాపారులు వస్తుంటారు. అలాగే ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కూరగాయలు, పండ్లు, ఇతర సరకులు రవాణా అవుతుంటాయి. రోజూ వందలాది ట్రక్కులు ఇక్కడ బారులు తీరి ఉంటాయి. ఈ కరోనా కాలంలో ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా వందలాది అమ్మకం దారులు, కొనుగోలుదారులతో ఈ మార్కెట్ కిటకిటలాడుతుంటుంది. సోమవారం కడలూరులో నమోదు చేసిన 122 కరోనా కేసులు కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉన్నవే.. ఒక పోలీసు అధికారితో సహా 450 మందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఈ మార్కెట్ ను సందర్శించి అనేకమంది తమకు తెలియకుండానే దీనితో ‘టచ్’ అయ్యారు. మొత్తం 459 మందిని క్వారంటైన్ కి తరలించేందుకు 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు విల్లుపురం అధికారులు తెలిపారు. ఇంకా రెండు వందలమందికి పైగా టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.