‘మీది కొరౌనా’ ఊరా ? అయితే మీకు మేం దూరం’! యూపీలో ఓ గ్రామవాసులపై వివక్ష

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో దాదాపు ఇదే పేరున్న ఆ ఊరి ప్రజలకు ఇది శాపంలా పరిణమించింది. ఆ గ్రామ ప్రజలన్నా, అసలు ఆ ఊరన్నా అంతా భయపడిపోతున్నారు. ఆ విలేజ్ పేరే..'కొరౌనా' !

మీది కొరౌనా ఊరా ? అయితే మీకు మేం దూరం! యూపీలో ఓ గ్రామవాసులపై వివక్ష

Edited By:

Updated on: Mar 30, 2020 | 2:26 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో దాదాపు ఇదే పేరున్న ఆ ఊరి ప్రజలకు ఇది శాపంలా పరిణమించింది. ఆ గ్రామ ప్రజలన్నా, అసలు ఆ ఊరన్నా అంతా భయపడిపోతున్నారు. ఆ విలేజ్ పేరే..’కొరౌనా’ ! యూపీ సీతాపూర్ జిల్లాలోని ఈ గ్రామానికి పట్టిన దుస్థితి ఇది ! కరోనా పేరుకీ, దీనికీ దగ్గరి ‘పోలికలు’ ఉండడంతో.. అమాయకులైన ఇతర ప్రజలంతా ఈ ఊరివాళ్లంతా కరోనా బాధితులని భయపడిపోతున్నారు. ఆ విలేజ్ లో ప్రవేశించడానికే జంకుతున్నారు. తమ గ్రామానికి ఎవరూ రావడంలేదని, ఇది అసలు తమ ఊరిపేరని చెప్పగానే పారిపోయినంత పని చేస్తున్నారని రాజన్ అనే ఈ గ్రామవాసి ఒకరు చెప్పారు. తమలో ఎవరికీ కరోనా ఇన్ఫెక్షన్ సోకలేదని, తాము ఆరోగ్యవంతులమని చెప్పినా అనేకమంది నమ్మడంలేదన్నారు. కనీసం మా టెలిఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడంలేదని, ఒకవేళ రిసీవ్ చేసుకున్నా ఊరిపేరు చెప్పగానే చటుక్కున ఫోన్ పెట్టేస్తున్నారని మరొకరు వాపోయారు. పోలీసులు కూడా మమ్మల్ని వింత జంతువుల్లా చూస్తున్నారు. కొరౌనా అనే విలేజ్ ఉన్న సంగతే తమకు తెలియదని అంటున్నారు.. మేం జోక్ చేస్తున్నామని మమ్మల్ని హేళన చేస్తున్నారు అని ఆ వ్యక్తి దాదాపు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటివరకూ తామెన్నడూ ఎదుర్కోని దాదాపు ‘సంఘ బహిష్కరణను’  ఇప్పుడు తాము ఎదుర్కొంటున్నామని మరో వ్యక్తి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు.

 

 

Follow Us