Corona: త్వరలోనే ప్రైవేటు మార్కెట్లోకి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌… వీలైనంత త్వరగా అనుమతిచ్చే అవకాశం..

Corona Vaccine In Private Market: దాదాపు ఏడాది పాటు యావత్‌ ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే..

Corona: త్వరలోనే ప్రైవేటు మార్కెట్లోకి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌... వీలైనంత త్వరగా అనుమతిచ్చే అవకాశం..

Updated on: Feb 04, 2021 | 5:49 AM

Corona Vaccine In Private Market: దాదాపు ఏడాది పాటు యావత్‌ ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే ప్రస్తుతానికి ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. త్వరలోనే వ్యాక్సినేషన్‌ను ప్రైవేటు మార్కెట్‌లో అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రామన్ని ముమ్మరంగా చేపట్టేందుకు అనుకున్న సమయానికంటే ముందుగానే వ్యాక్సిన్లను ప్రైవేటు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ నాటికి వ్యాక్సినేషన్‌ను ప్రైవేట్‌ మార్కెట్‌లో అనుమతించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌లో తయారైన కొవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటిక్‌ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Corona Vaccine Video: నిర్లక్ష్యంగా ఉండే వారికి షాక్‌ ఇచ్చిన వైద్యులు. ఇంతకీ వాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏంటి..?