దేశంలో కరోనా విజృంభణ.. 70లక్షలు దాటేసిన కేసులు

| Edited By:

Oct 11, 2020 | 5:33 PM

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 74,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

దేశంలో కరోనా విజృంభణ.. 70లక్షలు దాటేసిన కేసులు
Follow us on

Corona Updates India: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 74,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. తాజాగా 918  మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,08,334 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కొత్తగా 89,154 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 60,77,976 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా  8,67,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక కోవిడ్‌ బాధితుల రికవరీ రేటు 86.17 శాతంగా ఉందని.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.30 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ  వెల్లడించింది. ఇక మరణాల రేటు 1.54 శాతానికి తగ్గిందని పేర్కొంది. మరోవైపు శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 10,78,544 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు పరీక్షల సంఖ్య 8,68,77,242కు చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.

Read More:

కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిల కొత్త రకం దందా

పెళ్లి సందడి 2: హీరోయిన్‌గా ఖుషీ కపూర్..!