Covid-19: రాష్ట్రపతి భవన్‌కూ కరోనా సెగ.. కోవింద్ నిర్ణయం ఇదే

|

Mar 14, 2020 | 6:56 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చివరికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరింది. దాంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Covid-19: రాష్ట్రపతి భవన్‌కూ కరోనా సెగ.. కోవింద్ నిర్ణయం ఇదే
Follow us on

Covid-19 virus effected Rashtrapati Bhavan program: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చివరికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరింది. దాంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దాంతో దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో వుందో మరోసారి తేటతెల్లమైంది.

ఏప్రిల్ మూడో తేదీన రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రపతి భవన్ అధికారులు. అందు కోసం ఈ నెల 6 తేదీన సర్క్యులర్ విడుదల చేస్తూ.. అవార్డు గ్రహీతలకు సమాచారం అందించారు. అదే విధంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లకు చర్యలు మొదలు పెట్టారు. పద్మ అవార్డులు తీసుకునే విధానాన్ని అవార్డు విన్నర్లకు తెలియజేశారు. త్వరలోనే దానికి సంబంధించిన రిహార్సల్స్‌ని ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

కానీ, ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా కలకలం మొదలైంది. గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అన్ని ప్రోగ్రామ్స్‌ని నిర్వాహకులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతిభవన్‌లో ఏప్రిల్ 3వ తేదీన జరగాల్సిన పద్మ అవార్డుల ఫంక్షన్‌ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.