పుల్వామా జిల్లాలో పోలీసు నుంచి రైఫిల్ లాక్కుని ఆ మాజీ మిలిటెంట్ ఏం చేశాడంటే ?…ఖంగు తిన్న ఖాకీలు

| Edited By: Phani CH

Jun 02, 2021 | 8:43 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సినీ ఫక్కీలో ఓ ఘటన జరిగింది.

పుల్వామా జిల్లాలో పోలీసు నుంచి రైఫిల్ లాక్కుని ఆ మాజీ మిలిటెంట్ ఏం చేశాడంటే ?...ఖంగు తిన్న ఖాకీలు
Cop Injured In Pulwama
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సినీ ఫక్కీలో ఓ ఘటన జరిగింది. మాజీ మిలిటెంట్ గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం ఈ కార్యాలయానికి తీసుకురాగా.. ఆ వ్యక్తి ఓ పోలీసు నుంచి రైఫిల్ లాక్కుని కాల్పులు జరిపాడు.. అనుకోని ఈ ఘటనలో ఆ పోలీసు గాయపడ్డాడు. ఈ వ్యక్తిని పట్టుకోవడానికి ఇతర పోలీసులు ప్రయత్నించగా అతగాడు పారిపోయి ఈ కార్యాలయంలోని జనరేటర్ రూమ్ లో దాక్కున్నాడట.. సరెండర్ కావలసిందిగా పోలీసులు కోరినప్పటికీ అతడు నిరాకరించాడని తెలిసింది. ఆ వ్యక్తిని ఆ తరువాత మహమ్మద్ అమీన్ మాలిక్ గా గుర్తించారు. కాగా భద్రతా లోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ క్యాంప్ ఇన్-ఛార్జిని సస్పెండ్ చేసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే మాలిక్ ని అరెస్టు చేశారా అతనికి ఉగ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయా అన్న విషయం తెలియలేదు.

పుల్వామా జిల్లాలో పాక్ ఉగ్రవాదులు అమాయక యువకులకు మాయ మాటలు చెప్పి వారిని టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంటారని అధికారులు అంటున్నారు. బహుశా ఈ కుర్ర మిలిటెంట్ ను కూడా వారు ఎంకరేజ్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mr. Chillal’s Nails: టీచర్ మీద కోపంతో గత 69 ఏళ్లపాటు పెంచిన గోర్లను కట్ చేయించుకున్న శ్రీధర్ చిల్లాల్

Walnuts: వాల్‌నట్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కరోనా టైంలో ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!