టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘జులాయ్’ సినిమా గుర్తుందా? బ్యాంక్ నుంచి దోచుకున్న రూ. 1,500 కోట్ల చుట్టే సినిమా మొత్తం ఉంటుంది. అంత నగదును ఓ కంటైనర్‌లో పెట్టి తిప్పుతారు. సినిమా చివర్లో డబ్బుతో ఉన్న లోడ్ నడి రోడ్డుపై నిలిచిపోతుంది. అచ్చం అలాంటి సీనే చెన్నైలోనూ చోటు చేసుకుంది. అయితే, అది దొంగిలించిన సొమ్ము కాదండోయ్.. ఆర్బీఐ సొమ్ము. అవును, అక్షరాలా రూ. 535 కోట్ల నగదుతో వెళ్తున్న కంటెయినర్.. ఒక్కసారిగా నడిరోడ్డుపై ఆగిపోయింది. బ్రేక్‌డౌన్‌తో ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది ఆ కంటెయినర్. అయితే, దీనివెంటే మరో కంటెయినర్ కూడా ఉండటంతో.. అది కూడా నిలిచిపోయింది. చెన్నై-తిరుచ్చి హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే భారీ స్థాయిలో ప్రొటెక్షన్ కల్పించారు. కంటైనర్ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. చివరకు కంటెయినర్ రిపీర్ చేసి.. నగదును సురక్షితంగా ఆర్బీఐకి కేంద్రానికి తరలించారు పోలీసులు. కాగా, కంటెయినర్ బ్రేక్‌డౌన్ కారణంగా.. చెన్నై-తిరుచ్చి హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తరువాత ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..