One Nation One Election: జమిలి ఎన్నికలపై ఏ పార్టీలు అనుకూలం? ఏవి వ్యతిరేకం?

నేడు జమిలి ఎన్నికల బిల్లును కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై పార్టీల వైఖరి ఎలా ఉందంటే?

One Nation One Election: జమిలి ఎన్నికలపై ఏ పార్టీలు అనుకూలం? ఏవి వ్యతిరేకం?
One Nation One Election
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 17, 2024 | 1:03 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల 17వ రోజైన ఈరోజు ప్రభుత్వం లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు డిసెంబర్ 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక కోసం 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. సమ్మతి కోసం బిల్లును జేపీసీకి పంపనున్నట్లు కూడా సమాచారం. అయితే ఎంపీలందరికీ బీజేపీ, శివసేన మూడు లైన్ల విప్ జారీ చేశాయి. అలాగే సభకు హాజరు కావాలని కోరారు.

ఈ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాల మద్దతు కూడా లభించింది. మిత్రపక్షాలు ప్రభుత్వానికి, బిల్లుకు అండగా నిలుస్తున్నాయని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇది అనవసరమైన బిల్లు అని, అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడం అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. ఈ కార్యక్రామనికి అందరూ ఎంపీలు సభకు  తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.

జమిలి బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.  ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గడువును పార్లమెంట్ నిర్దేశించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టికల్ 82 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి విస్తృత అధికారం కల్పిస్తుందని తెలిపారు. ఇది ఎన్నికల సంస్కరణ ఎంతమాత్రం కాదని, ఇది కేవలం ఒక పెద్దమనిషి కోరికను నిజం చేయడం తప్ప మరేదీ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని డీఎంకే సూచించింది. బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. జమిలి బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడి ఎంపీ మహ్మద్ బషీర్ విమర్శించారు. జమిలి బిల్లును శివసేన (ఉద్దవ్ బాల్ ఠాక్రే) పార్టీ కూడా వ్యతిరేకించింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఎన్నికల సంఘం సమర్థత ప్రశ్నార్థకంగా ఉందని, మహారాష్ట్ర శివసేన ఎన్నికల గుర్తు విషయంలో వ్యవహరించిన తీరే నిదర్శనమని శివసేన (UBT) ఎంపీలు మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి