
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వర్షంలో తడిసి ముద్దవుతూ కనిపించారు. భారీ వర్షంలో గొడుగు లేకుండా నిలబడి కనిపించారు. ఈ ప్రత్యేక సందర్భంగా రాహుల్ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో, “స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ద్వారా సాధించిన ఈ స్వేచ్ఛ, భారతదేశాన్ని నిర్మించడానికి ఒక ప్రతిజ్ఞ – ఇక్కడ న్యాయం సత్యం, సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి హృదయంలో గౌరవం, సోదరభావం ఉంటుంది. ఈ విలువైన వారసత్వం గర్వం, గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్.. అంటూ రాసుకొచ్చారు.
#WATCH | Delhi: Congress leaders, including party chief Mallikarjun Kharge, Lok Sabha LoP Rahul Gandhi, Ajay Maken and others participate in #IndependenceDay celebrations at the party office. pic.twitter.com/455BM8H5gv
— ANI (@ANI) August 15, 2025
ప్రియాంక గాంధీ కూడా దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ” దేశవాసులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన లక్షలాది మంది వీరులు లెక్కలేనన్ని త్యాగాలు చేయడం ద్వారా మనకు స్వేచ్ఛను అందించారు. వారు ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, పరస్పర ఐక్యత అనే జాతీయ సంకల్పాన్ని మనకు అందజేశారు. ఒక వ్యక్తి – ఒక ఓటు అనే సూత్రం ద్వారా మనకు సంపన్నమైన ప్రజాస్వామ్యాన్ని అందించారు. మన స్వేచ్ఛ, రాజ్యాంగం.. దాని సూత్రాలను రక్షించాలనే మా సంకల్పం దృఢమైనది. జై హింద్! జై భారత్! ” అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..