Karnataka Election Results: ఓట్ల పోలరైజేషన్‌ ఫుల్ సక్సెస్.. కాంగ్రెస్‌‌కు కలిసొచ్చిన పక్కా వ్యూహం ఇదేనా..

అధికారంలోకి రావాలనే లక్ష్యంగా సీనియర్లు కలిసి సాగడం ఒక ఎత్తు అయితే.. వివిధ సామాజికవర్గాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ అయ్యింది. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కే పడినట్టు తెలుస్తోంది. ఇక JDSకు బ్యాక్‌బోన్‌గా ఉన్న వక్కలిగ ఓటర్లను ఆకర్షించడంలోనూ కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించాయి.

Karnataka Election Results: ఓట్ల పోలరైజేషన్‌ ఫుల్ సక్సెస్.. కాంగ్రెస్‌‌కు కలిసొచ్చిన పక్కా వ్యూహం ఇదేనా..
Congress Party

Updated on: May 13, 2023 | 1:05 PM

కర్నాటకలో ఓట్ల పోలరైజేషన్‌ విషయంలో కాంగ్రెస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. అధికారంలోకి రావాలనే లక్ష్యంగా సీనియర్లు కలిసి సాగడం ఒక ఎత్తు అయితే.. వివిధ సామాజికవర్గాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ అయ్యింది. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కే పడినట్టు తెలుస్తోంది. ఇక JDSకు బ్యాక్‌బోన్‌గా ఉన్న వక్కలిగ ఓటర్లను ఆకర్షించడంలోనూ కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించాయి. JDSకు పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఘణనీయంగా ఓట్లు సాధించడమే దీనికి నిదర్శనం.

ST, SC సామాజికవర్గాలకు చెందిన ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏతావాతా చూస్తే ఈ ఎన్నికల ద్వారా అటూ JDSను దెబ్బతీసిన కాంగ్రెస్‌.. బీజేపీని మట్టికరిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పాగా వేసింది. కేవలం కోస్టల్ కర్నాటక, గ్రేటర్‌ బెంగళూరులో తప్ప మిగతా చోట్ల కమలనాథులు ప్రభావం చూపించలేకపోయారు.

ర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు జరిగిన ఓట్ల లెక్కింపు పూర్తికాగా, అభ్యర్థుల్లో క్షణక్షణం గందరగోళం, రాజకీయ నేతల్లో టెన్షన్, కరుణాద్ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు కూడా. అవును.. కర్ణాటకలోని 224 నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ఓటర్లు రాసుకున్న 2615 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది క్షణాల్లో తేలిపోనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం