
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిఎంఓలో కలిశారు. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి పీఎంఓలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో పాటు, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. CBI డైరెక్టర్‌ను కేబినెట్ నియామకాల కమిటీ (ACC) నియమిస్తుంది.
ఈ ఉన్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ CBI డైరెక్టర్ పదవికి ఒక పేరును ఆమోదిస్తుంది. ప్రస్తుతం CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం మే 25తో ముగియనుంది. ఆయన తర్వాత దేశానికి తదుపరి సీబీఐ డైరెక్టర్ ఎవరు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీసీ సమావేశం జరిగింది.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at Prime Minister's Office, in Delhi. pic.twitter.com/jnbsHbYcs8
— ANI (@ANI) May 5, 2025
ప్రవీణ్ సూద్ మే 2023లో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. 25 మే 2023న, ఆయన CBI డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో సూద్ సుబోధ్ జైస్వాల్ స్థానంలో వచ్చారు. ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్ కు చెందిన 1986 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. సీబీఐ డైరెక్టర్‌గా సూద్ పదవీకాలం మే 25తో ముగియనుంది.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (1946) ప్రకారం CBI డైరెక్టర్ నియమితులవుతారు. ఈ చట్టాన్ని 2013లో మార్చారు. ఈ సవరణ ప్రకారం, సీబీఐ చీఫ్ నియామకానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సు తప్పనిసరి చేయాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..