Rahul Gandhi: విపక్షాల ఐక్యపోరాటానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నాం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

|

Apr 08, 2022 | 8:31 PM

బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమన్నారు రాహుల్‌గాంధీ. మాజీ కేంద్రమంత్రి శరద్‌యాదవ్‌తో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. విపక్షాలను ఎలా ఏకం చేయాలన్న అంశంపై చర్చించారు

Rahul Gandhi: విపక్షాల ఐక్యపోరాటానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నాం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
Rahul
Follow us on

బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతికేంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandi). ఆర్జేడీ సీనియర్‌ నేత శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు రాహుల్. అధికధరలు , నిరుద్యోగం లాంటి సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ మతపరమైన విద్వేషాలను దేశమంతా రెచ్చగొడుతోందన్నారు రాహుల్‌గాంధీ. విపక్షాలను ఏకం చేయడానికి కార్యాచరణను ఇప్పటికే సిద్దం చేసినట్టు తెలిపారు రాహుల్‌. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ , బీజేపీని వ్యతిరేకించే శక్తులంతా ఐకమత్యంగా పోరాటం చేయాలన్నారు. సీబీఐ , ఈడీ , ఐటీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్ర భయపెట్టే ప్రయత్నాలు చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. విపక్షాలను ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లడానికి తాను ప్రయతిస్తానని తెలిపారు రాహుల్‌గాంధీ.

రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపడితేనే పార్టీ బలపడుతుందన్నారు శరద్‌యాదవ్‌. ఆవిషయాన్ని తప్పకుండా పరిశీలిస్తానని అన్నారు రాహల్‌గాంధీ. జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన శరద్‌యాదవ్‌.. కొద్దిరోజుల క్రితమే ఆర్జేడీలో చేరారు. బీహార్‌ సీఎ నితీష్‌తో విభేదాల కారణంగా ఆయన జనతాదళ్‌( యునైటెడ్‌) అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌గాంధీ త్వరలో చేపడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విపక్షాలకు చెందిన సీనియర్‌ నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..