Navjot Singh Sidhu meets Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మధ్య ‘వార్’ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీలో నువ్వా? నేనా? అంటూ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య ఇంత కాలం జంఝాటం సాగుతూ వస్తోంది. దీంతో ఇద్దరు నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసంతృప్త నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.
అయితే అంతకు ముందు సిద్దూతో భేటీ కావడానికి రాహుల్ నిరాకరించారు. దీంతో సిద్దూ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్దూ మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో నేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు అధిష్ఠానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించి అధిష్ఠానానికి ఓ రిపోర్టు కూడా సమర్పించింది. అయితే, తాజాగా సిద్దూకు పార్టీలో కీలకమైన పదవి ఇవ్వడానికి అధిష్ఠానం రెడీ అయ్యింది.
नवजोत सिद्धू ने राहुल गांधी से मुलाकात की। कांग्रेस आलाकमान, सरकार में सिद्धू को कोई अहम जिम्मेदारी देकर मनाने की कोशिश में है, लेकिन सिद्धू लगातार इस बात पर जोर दे रहे हैं कि मुख्यमंत्री उनके साथ काम नहीं कर सकते। https://t.co/8Sruw8CtEY#NavjotSinghSidhu #RahulGandhi #Congress pic.twitter.com/cpcTopwQmP
— Prabhasakshi (@prabhasakshi) June 30, 2021
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతల మధ్య ‘వార్’ ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం వస్తుందని అధిష్ఠానం ఆలోచించి, ఓ ఫార్ములా తయారు చేసింది. ఒకటి రెండు రోజుల్లో అధిష్ఠానం ఓ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సిద్దూకు పార్టీలో అత్యంత కీలకమైన పదవి కట్టబెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవిని సిద్దూకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సిద్దూ కూడా చాలా రోజులుగా ఇదే పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దూ కోరుకున్నదే అధిష్ఠానం ఇవ్వనుంది.