కాంగ్రెస్ పార్టీకి షాక్.. కీలక నేతకు ఐటీ నోటీసులు..

| Edited By:

Feb 19, 2020 | 4:10 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.400 కోట్ల రూపాయల హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయని.. ఈ మనీ కేసులో.. విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 131 కింద అహ్మద్‌ పటేల్‌కు ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 14న విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. […]

కాంగ్రెస్ పార్టీకి షాక్.. కీలక నేతకు ఐటీ నోటీసులు..
Follow us on

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.400 కోట్ల రూపాయల హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయని.. ఈ మనీ కేసులో.. విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 131 కింద అహ్మద్‌ పటేల్‌కు ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 14న విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అయితే తన ఆరోగ్యం బాగులేదని.. శ్వాస సంబంధింత సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది.