నిలిచిన మెట్రో.. ఆందోళనలో ప్రయాణికులు

| Edited By:

Nov 02, 2019 | 3:38 PM

మెట్రో కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ ఎన్సీఆర్‌కు లైఫ్‌లైన్‌గా మారిన మెట్రోలో శనివారం ఓ కోచ్‌లో ఉన్నట్టుండి స్పార్కింగ్‌ వచ్చింది. బ్లూలైన్‌లోని ద్వారక నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నోయిడా వైపు వెళుతున్న మెట్రోలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పార్కింగ్‌ను గమనించిన ప్రయాణికులు.. విషయాన్ని ట్రైన్ ఆపరేటర్‌కు తెలియజేశారు. దీంతో ఆర్కే ఆశ్రమం వద్ద ట్రైన్ నిలిపివేసి, ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం ఆ ట్రైన్‌ను యమునా బ్యాంక్ డిపోకు తరలించారు. ఈ […]

నిలిచిన మెట్రో.. ఆందోళనలో ప్రయాణికులు
Follow us on

మెట్రో కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ ఎన్సీఆర్‌కు లైఫ్‌లైన్‌గా మారిన మెట్రోలో శనివారం ఓ కోచ్‌లో ఉన్నట్టుండి స్పార్కింగ్‌ వచ్చింది. బ్లూలైన్‌లోని ద్వారక నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నోయిడా వైపు వెళుతున్న మెట్రోలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పార్కింగ్‌ను గమనించిన ప్రయాణికులు.. విషయాన్ని ట్రైన్ ఆపరేటర్‌కు తెలియజేశారు. దీంతో ఆర్కే ఆశ్రమం వద్ద ట్రైన్ నిలిపివేసి, ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం ఆ ట్రైన్‌ను యమునా బ్యాంక్ డిపోకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే అన్ని మెట్రో రైళ్లు కూడా ఆగిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.