‘మా బలం 162… మీరే వచ్చి చూడండి ‘ .. గవర్నర్ కు సేన ట్వీట్

|

Nov 25, 2019 | 6:11 PM

మహారాష్ట్రలో మరో కొత్త పరిణామం.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కు ఈ రాత్రి 7 గంటలకు రావాల్సిందిగా పిలుపునిచ్చాయి. తమకు 162 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని, మీరే స్వయంగా వచ్చి చూడాలని అంటూ సేన నేత సంజయ్ రౌత్ గవర్నర్ కోష్యారీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గ్రాండ్ హయత్ హోటల్లో రాత్రి ఏడు గంటలకు రండి.. మొట్టమొదటిసారిగా మీరే స్వయంగా చూడండి అని ఆయన పేర్కొన్నారు. […]

మా బలం 162... మీరే వచ్చి చూడండి  .. గవర్నర్ కు సేన ట్వీట్
Follow us on

మహారాష్ట్రలో మరో కొత్త పరిణామం.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కు ఈ రాత్రి 7 గంటలకు రావాల్సిందిగా పిలుపునిచ్చాయి. తమకు 162 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని, మీరే స్వయంగా వచ్చి చూడాలని అంటూ సేన నేత సంజయ్ రౌత్ గవర్నర్ కోష్యారీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గ్రాండ్ హయత్ హోటల్లో రాత్రి ఏడు గంటలకు రండి.. మొట్టమొదటిసారిగా మీరే స్వయంగా చూడండి అని ఆయన పేర్కొన్నారు. ఈ పార్టీలు తమ ఎమ్మెల్యేలను నగరంలోని వివిధ హోటళ్లకు తరలించిన సంగతి తెలిసిందే.. ఏమైనా రాష్ట్ర గవర్నర్ ని చాలెంజ్ చేస్తూ సేన చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.