COVID-19 Vaccination Certificate: దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అలాగే కోవిడ్ -19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్, ఆరోగ్య సేతును కో-విన్ పోర్టల్‌తో అనుసంధానం చేసి.. వినియోగదారులు టీకా ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని సులభతరం చేసింది.
”కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఎలాంటి సమాచారం కావాలన్నా ఆరోగ్య సేతు యాప్ ద్వారా లభ్యమవుతుందని.. టీకా సమాచారాన్ని యాక్సెస్ చేయండి, కో-విన్ డాష్‌బోర్డ్‌ను చూడండి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే.. టీకా ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేయండి” అని ఆరోగ్య సేతు ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
మొదటిగా కో-విన్ అధికారిక వెబ్‌సైట్ Cowin.gov.inను సందర్శించాలి.
మీ 10-అంకెల మొబైల్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ కోసం ఫోటో గుర్తింపు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి
మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలను నమోదు చేయాలి.
మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, షెడ్యూల్ చేసిన తేదీ, సమయానికి టీకా కేంద్రాన్ని సందర్శించి.. వ్యాక్సిన్ వేయించుకోండి.
దీని తరువాత, మీరు మీ టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకోగలిగే రిఫరెన్స్ ఐడిని అందుకుంటారు.
ఆ తర్వాత మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందండి.
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!