
సమయం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమతా చేసిన కామెంట్స్‌తో రాజకీయ వర్గాలు షాకయ్యాయి. సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చని అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దూకుడు వ్యవహారానికి కొందరు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే కొందరు బీజేపీ నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగాళ్ రాష్ట్రంలో సీబీఐ దాడుల వెనుక ప్రధాని మోదీ చేశారని అనుకోవడం లేదన్నారు. బీజేపీ నేతలే ఈ దాడులు చేయిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం తన అజెండాను, పార్టీ ప్రయోజనాలను వేరుగా చూడాలన్నారు. ఇలాంటి వ్యవహారాలపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తీర్మానం ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల పక్షపాత పనితీరుకు మాత్రమే వ్యతిరేకమని దీదీ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 189-69 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. విపక్ష బీజేపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. అసెంబ్లీ నిబంధనలకు ఈ తీర్మానం వ్యతిరేకమని విపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం