Heart Attack: స్కూల్‌ టీచర్‌ పనీష్‌మెంట్.. గుంజీలు తీస్తూ 4వ తరగతి విద్యార్థి మృతి..

|

Nov 23, 2023 | 7:44 AM

బడి అల్లరి చేసిన విద్యార్ధులకు ఉపాధ్యాయులు పనిష్‌మెంట్‌ ఇవ్వడం సాధారణమే. తాజాగా ఓ స్కూల్‌ ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్‌ వేసిన శిక్ష విద్యార్ధి ప్రాణాలే పోయాయి. గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాధ ఘటన ఒరిస్సాలోని జైపూర్‌ జిల్లా ఒరాలీ గ్రామంలో చోటు చేసుకుంది. రసూల్‌పూర్‌ బ్లాక్‌ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్‌ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఒరాలీ గ్రామంలోని ప్రభుత్వం..

Heart Attack: స్కూల్‌ టీచర్‌ పనీష్‌మెంట్.. గుంజీలు తీస్తూ 4వ తరగతి విద్యార్థి మృతి..
Heart Attack To Class 4 Student
Follow us on

జైపూర్‌, నవంబర్‌ 23: బడి అల్లరి చేసిన విద్యార్ధులకు ఉపాధ్యాయులు పనిష్‌మెంట్‌ ఇవ్వడం సాధారణమే. తాజాగా ఓ స్కూల్‌ ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్‌ వేసిన శిక్ష విద్యార్ధి ప్రాణాలే పోయాయి. గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాధ ఘటన ఒరిస్సాలోని జైపూర్‌ జిల్లా ఒరాలీ గ్రామంలో చోటు చేసుకుంది. రసూల్‌పూర్‌ బ్లాక్‌ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్‌ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఒరాలీ గ్రామంలోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సూర్యనారాయణ్‌ నోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్ధి పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ఉన్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ఓ ఉపాధ్యాయుడు వారిని చూసి పనీష్‌మెంట్‌ ఇచ్చాడు. అందరినీ గుంజీల్లు (సిట్-అప్‌లు) చేయమని ఉపాధ్యాయుడు ఆదేశించాడు.

దీంతో ఐదుగురు విద్యార్ధులు గుంజీలు తీయడం ప్రారంభించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రుద్ర కుప్పకూలిపోవడంతో రసూల్‌పూర్ బ్లాక్‌లోని ఓరాలి గ్రామంలో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులకు వెంటనే ఘటన గురించి సమాచారం అందించారు. అనంతరం వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మార్గం మధ్యలో విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ధృవీకరించారని రసూల్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నీలాంబర్ మిశ్రా తెలిపారు. అయితే దీనిపై తమకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని మిశ్రా తెలిపారు. అధికారికంగా ఫిర్యాదు అందితే, విచారణ ప్రారంభిస్తామన్నారు. దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. రసూల్‌పూర్ అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రవంజన్ పాఠశాలను సందర్శించి సంఘటనపై ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.