పశ్చిమ బెంగాల్‌లో పదవ తరగతి విద్యార్థిని తీరును చూసి నివ్వెరపోతున్న అధికారులు.. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే..?

ఓ బాలిక.. తనకు సర్కార్ తీరుపై ఆగ్రహంతో తనకు అందిన సైకిల్‌ను అదికారులకు తిరిగి అప్పగించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓ జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో పదవ తరగతి విద్యార్థిని తీరును చూసి నివ్వెరపోతున్న అధికారులు.. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే..?

Girl rejects free bicycle : ఈరోజుల్లో ఉచితంగా వస్తుందంటే కాదనవారు ఉంటారా..? అందులోనూ ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును వదనుకోలేరు. అయితే, ఓ బాలిక.. తనకు సర్కార్ నుంచి అందిన సైకిల్‌ను అదికారులకు తిరిగి అప్పగించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న పశ్చిమ బెంగాల్‌లో ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ సర్కారు సాబుజ్ సాథీ పథకం కింద 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తోంది. ఈ పథకాన్ని 2015లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది మమతా సర్కార్.

తాజాగా ఈ పథకం కింద బిర్భూమ్ జిల్లాలో ఓ స్కూల్లో సైకిళ్లు పంచుతుండగా వింత ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సైకిల్‌ను ఓ విద్యార్థిని తిరస్కరించింది. దీనిపై ఆరా తీసిన అధికారులకు షాకిచ్చింది ఆ బాలిక.. తన తండ్రిపై తప్పుడు కేసులు మోపి అరెస్టు చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వంపై తాను ఈ విధంగా నిరసన తెలుపుతున్నానంటూ నిండు సభలో కరాఖండిగా చెప్పింది. దీంతో నివ్వెరపోయిన అధికారులు బాలికకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఇదిలావుంటే, సదరు విద్యార్థిని తండ్రి స్థానిక బీజేపీ నేత. ఆయన్ను గతేడాది సెప్టెంబరు 17న పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిలుపై ఆయన బయటకు వచ్చారు. కాగా, తండ్రిపై ప్రభుత్వ తీరుపై బాలిక నిరసన తెలపాలనుకుంది. దీంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ప్రభుత్వం ఇచ్చే సైకిల్‌ను తిరస్కరించడంలో తన ప్రమేయం ఏమీ లేదని, తన కూతురు స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందని సదరు బీజేపీ నేత తెలియజేశారు. మరోవైపు, బాలిక ధైర్యాన్ని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read Also… ఢిల్లీలో ఉధ‌‌ృతమవుతున్న రైతు సంఘాల ఆందోళన.. అన్నదాతలతో చర్చించేందుకు ఎప్పడూ సిద్ధమేనన్న ప్రధాని మోదీ