ఇటు నిరసనలు.. అటు మేధావుల మద్దతు.. సీఏఏపై మిశ్రమ స్పందనలు

| Edited By: Anil kumar poka

Dec 21, 2019 | 2:33 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై అప్పుడే క్రమేపీ సీన్ మారుతోంది. ఇప్పటివరకు అనేకమంది రచయితలు , కవులు, చరిత్రకారులు ఈ చట్టం పట్ల నిరసన వ్యక్తం చేయగా.. తాజాగా 1100 మందికి పైగా విద్యావేత్తలు, మేధావులు, రీసర్చ్ స్కాలర్లు దీనికి అనుకూలంగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ చట్టానికి తమ వ్యక్తిగత హోదాలో మద్దతునిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో-2003 లోనే…. నాడు రాజ్యసభలో ఇలాంటి చట్టానికి సపోర్ట్ ప్రకటించిన విషయాన్నీ […]

ఇటు నిరసనలు.. అటు మేధావుల మద్దతు.. సీఏఏపై మిశ్రమ స్పందనలు
Follow us on

సవరించిన పౌరసత్వ చట్టంపై అప్పుడే క్రమేపీ సీన్ మారుతోంది. ఇప్పటివరకు అనేకమంది రచయితలు , కవులు, చరిత్రకారులు ఈ చట్టం పట్ల నిరసన వ్యక్తం చేయగా.. తాజాగా 1100 మందికి పైగా విద్యావేత్తలు, మేధావులు, రీసర్చ్ స్కాలర్లు దీనికి అనుకూలంగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ చట్టానికి తమ వ్యక్తిగత హోదాలో మద్దతునిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో-2003 లోనే…. నాడు రాజ్యసభలో ఇలాంటి చట్టానికి సపోర్ట్ ప్రకటించిన విషయాన్నీ వారు గుర్తు చేశారు. అయితే దేశంలో పలు చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ వద్ద శనివారం ఉదయం విద్యార్థులు నిరసన ప్రదర్శనలకు దిగారు. యూపీలోని రాంపూర్ లో పెద్ద సంఖ్యలో గుమికూడిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు ఖాకీలు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు.

మొరాదాబాద్ లో శుక్రవారం జరిగిన అల్లర్లకు ప్రతీకారంగా నిరసనకారులు రాంపూర్ లో పోలీసులతో ఘర్షణలకు దిగారు. మొరాదాబాద్ లో జరిగిన అల్లర్లలో 39 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. అటు- లక్నో, చెన్నై, బీహార్ లోని భగల్పూర్ వంటి చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. చెన్నై రైల్వే స్టేషన్ వద్ద వామపక్షాలు, విద్యార్థులు ఆందోళనకు పూనుకొన్నారు. పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని ముందుకు రాబోయినవారిపై ఖాకీలు లాఠీచార్జి చ్చేశారు. అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. భగల్పూర్ లో ఆర్జేడీ కార్యకర్తలు పలు వాహనాలను ధ్వంసం చేశారు. బీహార్ బంద్ సందర్భంగా అనేక చోట్ల స్కూళ్ళు, దుకాణాలు మూసి వేశారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేసిన పక్షంలో వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్ఛరించారు. మీ ఆస్తులను జప్తు చేస్తామని [పేర్కొన్నారు. సీసీఫుటేజీ ఆధారంగా సంఘ విద్రోహ శక్తుయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిత్యనాథ్ అన్నారు.