పెంపుడు జంతువులు మనం నేర్పించే పనులను ఈజీగా నేర్చుకుని చేస్తుంటాయి. అందులోనూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కుక్కలు ఇంకేలా ఉంటాయో ఆలోచించండి.. అవి ప్రత్యేకంగా శిక్షణ పొందుతాయి.. అయితే అలాంటి సీఐఎస్‌ఎఫ్ డాగ్స్ యోగా కూడా చేస్తాయని మీకు తెలుసా? ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ బ్లాక్ లాబ్రడార్ కుక్క ట్రైనర్‌తో కలిసి యోగా చేసింది. యోగా దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను విభిన్న రీతుల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఆ రోజును జరుపుకుంటారు. అయితే ఈ కుక్క అలా కాదు. ఇది తన శిక్షకుడితో యోగాను కూడా అభ్యసిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు.
ఈ కుక్క సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మెట్రో స్టేషన్‌లో యోగా చేస్తుండగా, స్థానికులు, సిబ్బంది దాన్ని వీడియో తీస్తూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఈ కుక్క క్రమశిక్షణ, శ్రద్ధను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం కుక్క ట్రైనింగ్ చూసి ఫిదా అవుతున్నారు.
ఎక్కువ మంది కుక్కల్ని పెంచుకుంటుంటారు. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వడం, వాకింగ్ కి తీసుకెళ్లడం, పెంపుడు జంతువులతో పలురకాల ఆటలు కూడా ఆడుతుంటారు. అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నైపుణ్యం నేర్పడం అంత సులభం కాదు.. జంతువులు మానవ నైపుణ్యాలను అలవర్చుకోవడం అంత సులభం కాదు. అభ్యాసకునికి, ఉపాధ్యాయునికి ఇద్దరికీ సహనం ప్రేమ ఎంతో అవసరం అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి