
లడఖ్ లో చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై లడఖ్ బీజేపీ ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్ ఫైరయ్యారు. లడఖ్ లో మన భూభాగాలను చైనా దళాలు ఆక్రమించుకున్నాయా అని రాహుల్ ప్రశ్నించగా.. ఈ ఆక్రమణలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన ట్వీట్ చేశారు. బహుశా కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు కనబడుతోందన్నారు. 1962 లో ఈ పార్టీ ప్రభుత్వ హయాంలో 37,244 చదరపు కిలోమీటర్ల అక్రాయి చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందన్నారు. 2012 లో చుమురు ఏరియాలోని కీలక ప్రాంతాలను చేజిక్కించుకుందని, 2012 లో పదమూడు సిమెంట్ నిర్మాణాలు చేపట్టిందని ఆయన అన్నారు. 2008-2009 లోనే యూపీయే హయాంలో డూమ్ చీలే అనే ప్రాంతాన్ని కూడా చైనా తన హస్తగతం చేసుకుందంటూ ఒక మ్యాప్ ని కూడా జామ్ యాంగ్ విడుదల చేశారు.
అయితే రాహుల్ ఈ ట్వీట్లను తేలిగ్గా పరిగణిస్తూ.. చైనా వారు ఈ ప్రాంతాలనన్నింటినీ ఆక్రమించుకున్నా.. ప్రధాని మోదీ మౌనంగా ఉంటూ సీన్ నుంచి మాయమయ్యారని తానూ ఓ ట్వీట్ చేశారు. అలాగే హోమ్ మంత్రి అమిత్ షా.. నిన్న బీజేపీ కార్యకర్తల వర్చ్యువల్ ర్యాలీని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని కూడా రాహుల్ అపహాస్యం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ మాదిరే మన దేశం కూడా తన బోర్డర్ ని రక్షించుకోగలదన్న అమిత్ షా వ్యాఖ్యలు పస లేనివన్నారు. ఆ దేశాలు తమ సరిహద్దులను ఎలా రక్షించుకుంటున్నాయో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు.
The Chinese have walked in and taken our territory in Ladakh.
Meanwhile
The PM is absolutely silent and has vanished from the scene.https://t.co/Cv06T6aMvU
— Rahul Gandhi (@RahulGandhi) June 10, 2020