Chennai Floods: వరుస ప్రకృతి విపత్తులతో మహా నగరం విలవిల.. ఎందుకిలా జరుగుతోంది..

| Edited By: Shaik Madar Saheb

Nov 14, 2024 | 9:11 PM

ఏడాది క్రితం వరకు ప్రకృతి చెన్నై మహా నగరాన్ని ఒకలా ఇబ్బంది పెడితే.. ఏడాది నుంచి మరోలా నానా కష్టాలకు గురి చేస్తుందా అన్నట్టుంది తాజా పరిస్థితి. గత ఏడాది నుంచి తరచూ తమిళనాడులో భారీ వర్షాలు వరదలు ముంచేత్తుతూనే ఉన్నాయి. అందులో చెన్నై నగరంలో పరిస్థితి మరి దారుణంగా ఉంది.

Chennai Floods: వరుస ప్రకృతి విపత్తులతో మహా నగరం విలవిల.. ఎందుకిలా జరుగుతోంది..
Chennai Floods
Follow us on

చెన్నపట్నం.. ఆ తర్వాత మద్రాస్.. ఇప్పుడు చెన్నై.. తమిళనాడు రాజధానిగా ఉన్న మహానగరం చెన్నైని ప్రకృతి ఎప్పుడూ పగ పడుతూనే ఉంటుంది.. ఏడాది మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది.. వేసవి వచ్చిందంటే చాలు గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జలాలను తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా విడుదల చేస్తేనే కనీసం చెన్నై నగరంలో సగానికైనా తాగునీరు అందుతుంది. మరి ఎద్దడి ఎక్కువగా ఉంటే తెలుగు గంగా జలాలు కూడా సరిపోక ఇతర ప్రాంతాల నుంచి రైళ్లలో తాగునీటిని సరఫరా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న చెన్నై మహా నగరానికి ఇప్పుడు ఈ రూపంలో విపత్తు వచ్చి పడింది..

బంగాళాఖాతంలో నిత్యం తుఫాన్లకు కారణమైన తమిళనాడు రాష్ట్రానికి కోరుకున్న అండమాన్ పరిసరాల్లో అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదిలో అల్పపీడనాలు ఏర్పడిన అవి తుఫానులుగా మారిన ముందుగా నష్టాన్ని తాకేది తమిళనాడు తీరాన్ని.. ఏడాదిలో సగటున 20 వరకు అల్పపీడనాలు ఏర్పడితే వాటిలో తుఫాన్లుగా మారేది కొన్ని మాత్రమే.. అలా తుఫాన్లుగా మారిన సందర్భంలో సగానికి తమిళనాడు చేరంలోని అవి తీరని దాటుతూ ఉంటాయి అందులో చెన్నై మహా నగరానికి ఉత్తరం దక్షిణంగా తీరం దాటిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తుఫాన్లు ఈ సమీపంలోని తీరం దాటిన వర్షాలు పెద్దగా కురిసే పరిస్థితి ఉండదు. గాలుల బీభత్సానికి ఆస్తి నష్టం చెట్లు కూలిపోవడం లాంటివి మాత్రమే జరుగుతూ ఉంటాయి.

అల్పపీడనాలు తుఫాన్లు వచ్చిన చెన్నై మహా నగరానికి సరిపడా తాగునీరు రిజర్వాయర్లలో ఉండే పరిస్థితి కూడా ఉండదు. కర్ణాటక నుంచి కావేరి… ఏపీ నుంచి కృష్ణా జలాలు వస్తేనే మహానగరాన్ని గొంతు తడిపే పరిస్థితి ఉంటుంది. దశాబ్దపైనుంచి చెన్నై మహానగరంలో ఉండే యదార్ధ పరిస్థితి ఇదే..

ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది.. ఏడాది క్రితం వరకు ప్రకృతి చెన్నై మహా నగరాన్ని ఒకలా ఇబ్బంది పెడితే.. ఏడాది నుంచి మరోలా నానా కష్టాలకు గురి చేస్తుందా అన్నట్టుంది తాజా పరిస్థితి. గత ఏడాది నుంచి తరచూ తమిళనాడులో భారీ వర్షాలు వరదలు ముంచేత్తుతూనే ఉన్నాయి. అందులో చెన్నై నగరంలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. రుతుపవనాల ప్రభావంతో కొన్ని సందర్భాల్లో అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వరదలు చెన్నై నగరాన్ని ముంచేస్తున్నాయి.. గడిచిన ఏడాదిలో సగటున ఏడు నెలల వరకు వర్షాలు కురుస్తూ ఉండడం గమనార్హం… అత్యల్పంగా నాలుగు సెంటీమీటర్ల నుంచి అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు గడిచిన ఏడాదిలో చెన్నై మహానగరంలో వర్షపాతం నమోదయింది.

చెన్నై మహా నగరానికి తాగునీరు అందించే పూండి రిజర్వాయర్, పులాల్ రిజర్వాయర్.. చమ్మరపాకం రిజర్వాయర్ ఇలా మరికొన్ని రిజర్వాయర్లలో ఇప్పుడు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడుకు ఇవ్వాల్సిన కృష్ణా జలాల వాటా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా.. ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా లేకుండా పోయింది.. ప్రస్తుతం చెన్నై మహానగరంలో అన్ని రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయి..

తాగునీటికి ఇబ్బంది లేకుండా రిజర్వాయర్లు నిండుగా ఉంటే మంచిదే.. కానీ చీటికిమాటికి అవసరం లేకుండా కురుస్తున్న అకాల వర్షాలు వరదలతో చెన్నై నగరంలో రోడ్లన్నీ నదుల మారిపోయిన పరిస్థితి.. ఏడాదిలో 100 కంటే ఎక్కువ రోజుల్లో కనిపిస్తూనే ఉంది. వర్షాలు మానవ జీవనానికి అవసరమే అయినా.. చెన్నై నగరంలో మాత్రం ఇది అవసరానికి మించి ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి..

వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదులు, చెరువుల మాదిరిగా మారిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోతోది.. ఇలా నిత్యం చెన్నై మహానగరంలో ఇదే పరిస్థితి కనబడుతోంది.. ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు తయారైంది చెన్న పట్నం పరిస్థితి.. తాగునీటి కోసం కటకట.. లేకుంటే వరదనీటితో ఇక్కట్లు.. ఇలా అన్న చందాన తయారైంది చెన్నై పరిస్థితి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..